హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Banned apps: టిక్​టాక్ నుంచి పబ్​జీ వరకు ఈ ఏడాది బ్యాన్ అయిన పాపులర్ యాప్స్ ఇవే..

Banned apps: టిక్​టాక్ నుంచి పబ్​జీ వరకు ఈ ఏడాది బ్యాన్ అయిన పాపులర్ యాప్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Yearender: దేశ భద్రత, సమచారానికి ముప్పుగా వాటిల్లాయని చైనాకు చెందిన 219 యాప్స్​ ను భారత ప్రభుత్వం ఈ ఏడాది బ్యాన్​ చేసింది. గల్వాన్ లోయలో చైనా దౌర్జన్యం తర్వాత ఆ దేశంపై భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది.

దేశంలో ప్రస్తుం టిక్​టాక్ (TikTok) వీడియోలు కనుమరుగయ్యాయి. పబ్​జీ (PUBG) ‘చికెన్ డిన్నర్లు’ జాడ లేకుండా పోయాయి. ఈ ఏడాది చైనాకు చెందిన అనేక యాప్​లు భారత్​లో నిషేధానికి గురయ్యాయి. ఎంతో పాపులర్ అయిన టిక్​టాక్​, పబ్​జీ, షేర్​ఇట్ (Share It) లాంటి యాప్స్ తో పాటు మరికొన్ని బ్యాన్ అయ్యాయి.

దేశ సరిహద్దులోని గల్వాన్ లోయ వద్ద చైనా దురాగతానికి భారత జవాన్లు అమరులు కావడంతో భారత్ ఆగ్రహించింది. అప్పటి  నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో డ్రాగన్​ దేశానికి చెందిన యాప్​లపై భారత ప్రభుత్వం వేటు వేసింది. దేశ సమగ్రతకు, రక్షణకు ముప్పు చేసేలా ఆ యాప్​లు ఉన్నాయని ప్రభుత్వం నిషేధించింది. జూన్​ 29న తొలుత టిక్​టాక్​, యూసీ బ్రౌజర్​, కామ్ స్కారన్​ సహా మొత్తం 59 యాప్​లు బ్యాన్ అయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 5న ఏకంగా 118 యాప్ లపై ప్రభుత్వం వేటు వేసింది. అందులో ప్రముఖ గేమ్ పబ్​జీ, పబ్​జీ లైట్​, వీచాట్ ఉన్నాయి.  ఇక నవంబర్ 24న మరో 43 చైనా యాప్​లపై భారత ప్రభుత్వం కొరడా ఘుళిపించింది. పాపులర్ ఈ కామర్స్ ప్లాట్​ఫామ్​ అలీ ఎక్స్ ప్రెస్​తో పాటు లాలా మూవ్​, స్నాక్ వీడియో తదితర వాటిని నిషేధించింది.

టిక్​టాక్​ (TikTok) కథ ముగిసింది

షార్ట్ వీడియో యాప్ టిక్​టాక్​ భారత్​లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్ బ్యాన్​ అయ్యే నాటికి భారత్​లో 20కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. అయితే 2019లోనే మద్రాసు హైకోర్టు ఆదేశాలతో కొంతకాలం టిక్​టాక్ గూగుల్​, యాపిల్ ప్లే స్టోర్లలో కనిపించలేదు. కాగా ఈ యాప్ వల్ల యువత పెడుదోవ పడుతోందని, వీడియోలు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర వ్యతిరేక వచ్చింది. టీనేజర్లలో మానసిక రుగ్మతలకు టిక్​టాక్​ కారణమవుతోందనే విమర్శలు వచ్చాయి. అయితే దీన్ని బ్యాన్ చేయడం సరికాదని కొంతకాలం తర్వాత సుప్రీం కోర్టు చెప్పడంతో ప్లేస్టోర్​లో టిక్​టాక్​ మళ్లీ వచ్చింది. మద్రాసు హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం టిక్​టాక్​పై పూర్తిగా నిషేధం విధించింది.

పబ్​జీ (PUBG)

PUBG, PUBG India, Games, APK, Banned Apps, పబ్జీ, పబ్జీ ఇండియా, గేమ్స్, బ్యాన్డ్ యాప్స్
ప్రతీకాత్మక చిత్రం                                                                                                                                                 ప్లేయర్ అన్​నౌన్ బాటిల్ గ్రౌండ్స్​(పబ్​జీ) గేమ్ భారత్​లో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. బ్యాన్​ కు ముందు ఏకంగా 5కోట్ల మంది ఈ గేమ్​ను ఆడుతుండేవారు. ముఖ్యంగా కొందరు యువత ఈ గేమ్​కు బానిసలయ్యారు. అయితే యువతలో నేర ప్రవృత్తిని పెంచే విధంగా ఉన్న ఈ గేమ్​పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోజులో గంటల తరబడి ఆడుతూ విద్యార్థులు చదువును పక్కనపెట్టేస్తున్నారని చాలా మంది తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసేవారు. కొన్ని రాష్ట్రాలు ముందే ఈ గేమ్ పై వేటు వేయగా.. సెప్టెంబర్​లో భారత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అయితే మళ్లీ భారత్​లో అడుగుపెట్టేందుకు పబ్​జీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా దేశంలో మళ్లీ ఆ కొత్తగా ఆ గేమ్ ప్రారంభమవుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

యూసీ బ్రౌజర్ (UC Browser)

కొన్ని సంవత్సరాలుగా యూసీ బ్రౌజర్ భారత్​లో హవా చూపించింది. గూగల్ క్రోమ్​కు సవాలు విసిరింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా గూగల్ క్రోమ్ తర్వాత అత్యధికంగా వాడుతున్న బ్రౌజర్​గా యూసీ నిలిచింది. ఇది కూడా చైనాలోని అలీబాబా గ్రూప్​కు చెందిందే. అయితే 2017 నుంచి ఫోనల్లో డిఫాల్ట్ గా యూసీని ఇవ్వడం మైక్రోమ్యాక్స్​, లావా, కార్బన్​, ఇంటెక్స్ సహా కొన్ని సంస్థలు నిలిపివేశాయి. దీంతో భారత్​లో 2019లో 16శాతం బ్రౌజర్ షేర్ ఉన్న యూసీ.. 2020 నాటికి ఆరు శాతానికి పడిపోయింది. కాగా ఈ బ్రౌజర్ ద్వారా డాటా లీక్ అవుతోందంటూ గతంలో కూడా చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి.

షేర్​ఇట్​ (ShareIt)

ఫైల్ షేరింగ్ యాప్ షేర్​ఇట్​ గురించి స్మార్ట్ ఫోన్ వాడే వారందరికీ తెలుసంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఈ యాప్ ఫేమస్ అయింది. దీనికి భారత్​లో 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండేవారు. ప్రాంతీయ భాషల్లో లోకల్ కంటెంట్​ , వీడియోలను స్ట్రీమ్ చేయడం కూడా షేర్ఇట్ ప్రారంభించింది. అయితే ఈ ఫీచర్లు మొదలైన కొన్నాళ్లకే బ్యాన్ అయింది.

షెయిన్​(Shein), క్లబ్​ ఫ్యాక్టరీ (Club Factory)

చైనాకు చెందిన ఈ కామర్స్​ సంస్థ క్లబ్​ఫ్యాక్టరీకి రోజుకు భారత్ నుంచి 25వేల ఆర్డర్లు వెళ్లేవి. అలాగే ఫ్యాషన్ వస్తువుల ప్లా​ట్​ఫామ్ అయిన షెయిన్​కు 10వేల ఆర్డర్లు దక్కేవి. ఇతర వెబ్​సైట్లు, మార్కెట్ల కంటే వస్తువులు తక్కువ ధరలో వస్తుండడంతో క్రమంగా ఈ యాప్​లు పాపులర్ అయ్యాయి. అయితే వీటిపై బ్యాన్ విధించడంతో చైనా రిటైల్​ను కూడా భారత్ దెబ్బకొట్టినట్టయింది. ఈ రెండు ఇప్పట్లో భారత్​లో అందుబాటులోకి వచ్చే అవకాశాలే కనిపించడం లేదు.

కామ్ స్కానర్​ (Cam Scanner)

పేపర్లను ఫొటోలు తీసి ఫోన్లోనే డాక్యుమెంట్లుగా మార్చుకునేందుకు ఉపయోగపడిన కామ్ స్కానర్ భారత్​లో విపరీతంగా సక్సెస్ అయింది. బ్యాన్ అయ్యే నాటికి దాదాపు 10కోట్ల మంది ఈ యాప్​ను వినియోగిస్తున్నారు. డాక్యుమెంట్లను జేపీజీ, పీడీఎఫ్​లుగా మార్చుకునే వీలుండేది. అయితే ప్రస్తుతం అడాబ్ స్కాన్​ తో పాటు చాలా యాప్​ లు దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చాయి.

అలీ ఎక్స్​ప్రెస్​

ఎలక్ర్టానిక్స్ తక్కువ ధరకు దొరకడంతో చైనాకు చెందిన ఆలీ ఎక్స్​ప్రెస్ భారత్​లో వేగంగా పాపులర్ అయింది. ముఖ్యంగా భారత్​లో దొరకని కొన్ని ఎలక్ట్రానిక్స్ సైతం ఆ వెబ్​సైట్లో దొరకడంతో వినియోగదారులు త్వరగా కొందరు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం ఈ వెబ్​సైట్ భారత్​లో ఓపెన్ అవుతున్నా.. ఎలాంటి ప్రాడక్ట్ ఆర్డర్ ఇచ్చే వీలు లేదు.

First published:

Tags: PUBG, Tiktok

ఉత్తమ కథలు