Home /News /trending /

APPLE ANNOUNCES BACK TO SCHOOL OFFERS GET APPLE BACK TO SCHOOL OFFER COMES TO INDIA WITH FREE AIRPODS MACBOOK DISCOUNTS FULL DETAILS HERE SU GH

Apple Back to School: విద్యార్ధుల కోసం యాపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్.. వీటిపై బంపరాఫర్​.. పూర్తి వివరాలు..

(Image: Apple)

(Image: Apple)

ప్రపంచ టెక్​ దిగ్గజం యాపిల్ భారతీయ విద్యార్థులకు బంపరాఫర్​ ప్రకటించింది. ‘బ్యాక్​ టు స్కూల్’​ పేరుతో విద్యార్థుల కోసం ప్రత్యేక సేల్​ను​ తీసుకొచ్చింది.

ప్రపంచ టెక్​ దిగ్గజం యాపిల్ భారతీయ విద్యార్థులకు బంపరాఫర్​ ప్రకటించింది. ‘బ్యాక్​ టు స్కూల్’​ పేరుతో విద్యార్థుల కోసం ప్రత్యేక సేల్​ను​ తీసుకొచ్చింది. ఈ సేల్​లో భాగంగా మ్యాక్​ లేదా ఐపాడ్​ కొనుగోలు చేసే విద్యార్థులకు యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. భారతదేశంలోని అన్ని యాపిల్ ఆన్​లైన్​ స్టోర్లలో 2021 సెప్టెంబర్ 27 వరకు ఈ ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. కొత్తగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు, బోధనా సిబ్బంది ఈ ఆఫర్​ను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

అర్హత, రిజిస్ట్రేషన్​ ప్రక్రియ
ఆఫర్లను పొందడానికి విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు తమ స్కూల్​ లేదా కాలేజ్​ జారీ చేసిన ఐడీ కార్డును యాపిల్​ ఆన్​లైన్​ స్టోర్లలో సమర్పించాల్సి ఉంటుంది. మిమ్మల్ని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడిగా ధృవీకరించిన తర్వాత ‘బ్యాక్ టు స్కూల్’ ప్రోగ్రామ్​లో పొల్గొనేందుకు యాక్సెస్​ లభిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఆఫర్లను పొందవచ్చు. అర్హులైన కస్టమర్లు UNiDays ప్లాట్​ఫామ్​ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యాపిల్​ కోరింది. యూనిడేస్​ ధృవీకరణ పోర్టల్​లో విద్యార్థి ఐడీ నంబర్​, పాఠశాల చిరునామా వివరాలను నమోదు చేయాలి. ఈ ధృవీకరణ పూర్తయిన తర్వాత బ్యాక్​ టు స్కూల్ సేల్​లో ఆఫర్లను పొందవచ్చు.

ఆఫర్లు, డిస్కౌంట్లు
బ్యాక్​ టు స్కూల్​ సేల్​లో భాగంగా​ ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్​బుక్ ఎయిర్, మ్యాక్​బుక్ ప్రో, ఐమాక్, మ్యాక్ ప్రో, మ్యాక్ మినీ వంటి ఉత్పత్తులకు ఆఫర్​ వర్తిస్తుంది. ఈ ఉత్పత్తులను ఏదేని ఒకదాన్ని కొనుగోలు చేసిన కస్టమర్లు సెకండ్​ జనరేషన్​ ఎయిర్ పాడ్​ను ఉచితంగా పొందుతారు. విద్యార్థులు ఈ ఎయిర్‌పాడ్లను వైర్‌లెస్ ఛార్జింగ్ ఎయిర్‌పాడ్లకు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అదనంగా రూ .4,000 చెల్లించాలి. అదే, ఎయిర్​పాడ్స్​ ప్రోను రూ. 10 వేలు పెట్టి అప్​గ్రేడ్​ చేసుకోవచ్చు. ఎయిర్​పాడ్స్​, ఎయిర్​పాడ్స్ వైర్​లెస్​ ఛార్జింగ్​, ఎయిర్​పాడ్స్​ ప్రోలపై ఈ​ ఆఫర్​ వర్తిస్తుంది. సేల్​లో భాగంగా ఉచిత ఎయిర్​పాడ్స్​తో పాటు యాపిల్​ కొన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్​ అందిస్తుంది. అర్హత గల కొనుగోలుదారులు మాక్‌బుక్​, యాపిల్ పెన్సిల్, కీబోర్డ్, యాపిల్​ టీవీ ప్లస్​, యాపిల్​ ఆర్కేడ్​లపై 20 శాతం వరకు డిస్కౌంట్​ కూడా పొందవచ్చు. యాపిల్ ఆర్కేడ్, యాపిల్ టీవీ + చందాతో పాటు 3 నెలల వరకు ఉచితంగా యాపిల్​ ఆర్కేడ్​ సబ్​స్క్రిప్షన్ కూడా​ పొందవచ్చు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Apple, Bumper offer, Schools reopening

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు