శాన్ఫ్రాన్సిస్కోలో నారింజ రంగులోకి మారిన ఆకాశం..ఎందుకో తెలుసా?

కాలిఫోర్ణియాలో సంభవించిన కార్చిచ్చు కారణంగా వేలాది ఎకరాలు అగ్రి కీలల్లో చిక్కుకొని దగ్దమయ్యాయి. అంతేకాక కార్చిచ్చు కారణంగా పెద్ద ఎత్తున వన్య ప్రాణులు మంటల్లో చిక్కుకొని సజీవ దహణమయ్యాయి.

news18-telugu
Updated: September 10, 2020, 7:22 PM IST
శాన్ఫ్రాన్సిస్కోలో నారింజ రంగులోకి మారిన ఆకాశం..ఎందుకో తెలుసా?
నారింజ రంగులోకి మారిన ఆకాశం
  • Share this:
2020 ప్రపంచానికి కలొసొచ్చినట్లు లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో విలవిలలాడిపోతుంటే. కార్చిచ్చుతో అమెరికాలోని అనేక నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. మరియు అది ముగిసినట్లు లేదు. గత నెలలో అమెరికాలో కార్చిర్చు విలయతాండవం చేసిన సంఘటన తెలిసిందే.. దీని పర్యవసానాలు మెల్లిమెల్లిగా అమెరికా అంతటా కనబడుతున్నాయి. కాలిఫోర్ణియాలో సంభవించిన కార్చిచ్చు కారణంగా వేలాది ఎకరాలు అగ్రి కీలల్లో చిక్కుకొని దగ్దమయ్యాయి. అంతేకాక కార్చిచ్చు కారణంగా పెద్ద ఎత్తున వన్య ప్రాణులు మంటల్లో చిక్కుకొని సజీవ దహణమయ్యాయి. దీంతో అమెరికాలోని పలు నగరాల్లో భారీ నష్టం వాటిల్లింది. కార్చిచ్చు కారణంగా ఏర్పడ్డ పొగలు, బూడిద శ్రాన్ఫ్రాన్సిస్కో నగరాన్ని కమ్మేశాయి.

కార్చిచ్చు కారణంగా అడవిలో మంటలు, బలమైన గాలులు, ఎక్కువ ఉష్ణోగ్రతలకు ఆజ్యం పోసింది. దీని వల్ల కాలిఫోర్నియా, ఒరెగాన్ మరియు వాషింగ్టన్లలో బుధవారం విస్తృతంగా దట్టమైన పొగలు వ్యాపించాయి, పశ్చిమ యుఎస్ రాష్ట్రాలలో అనేక గృహాలు, వ్యాపారాలు నాశనమయ్యాయి. కాలిఫోర్నియాలో ప్రారంభమైన కార్చిచ్చు క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రజలకు ఆకాశం నారింజ రంగులో కన్పిస్తుంది. అప్పుడప్పుడు ఆకాశం చాలా చీకటిగా కనిపిస్తుంది. అంతేకాక కొన్ని ప్రదేశాలలో బూడిద మంచులాగా పడిపోయింది, అడవిలో చెలరేగిన భారీ మంటలు గాలిని పొగ మరియు సిండర్లతో నింపడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

కాగా నారింజ రంగులో మారిన ఆకాశాన్ని ఫోటోలు, వీడియోలు తీసి ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో పొగ మందంగా ఉండటంతో చీకటి ఆకాశానికి కారణమవుతుందని అధికారులు వివరిస్తున్నారు. దీనిపై అక్కడి ప్రజలు ట్వట్టర్ వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై కిందరు దీన్ని భూమి కాకుండా ఇతర గ్రహాలతో పోలస్తే మరికొందరు. "ఈ ఏడాది మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదు అని అంటున్నారు.
Published by: Narsimha Badhini
First published: September 10, 2020, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading