సీఎం జగన్ సంచలన నిర్ణయం.. అన్ని బార్ల లైసెన్సులు రద్దు..

ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం దిశగా సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేశారు. ఈ నిర్ణయం ఉన్నఫలంగా అమల్లోకి వచ్చింది.

news18-telugu
Updated: November 22, 2019, 4:26 PM IST
సీఎం జగన్ సంచలన నిర్ణయం.. అన్ని బార్ల లైసెన్సులు రద్దు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం దిశగా సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేశారు. ఈ నిర్ణయం ఉన్నఫలంగా అమల్లోకి వచ్చింది. అంటే.. డిసెంబరు 31 వరకు లైసెన్సుకు గడువు ఉన్నా, బార్లను తెరవొద్దు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కొత్త బార్ల పాలసీని ప్రకటించిన సర్కారు.. ఇప్పటికే మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూయిస్తుండగా, ఇప్పుడు రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గించబోతోంది. జనవరి నుంచి అమలయ్యే కొత్త పాలసీలో ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త విధానం ప్రకారం రెండేళ్లకు లైసెన్సు ఇవ్వనుంది. లైసెన్సు ఫీజు కింద దరఖాస్తుకు.. రూ.10 లక్షలుగా నిర్ణయించింది. లాటరీ ద్వారా బార్‌ను కేటాయించేందుకు చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేలా అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.

అటు.. ప్రస్తుతం ఏపీలో మొత్తం 798 బార్లు ఉండగా.. కొత్త పాలసీ అమలయ్యే నాటికి ఆ సంఖ్య 479కి చేరనుంది. కాగా, 38 త్రీ స్టార్ హోటళ్లకూ, 4 మైక్రో బేవరేజ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. మద్యం ధరలను కూడా పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...