Home /News /trending /

konijeti rosaiah : ఇక సెలవా మరి! -దేవరయాంజాల్‌ ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నేడు -స్మృతి వనానికి కాంగ్రెస్ తీర్మానం

konijeti rosaiah : ఇక సెలవా మరి! -దేవరయాంజాల్‌ ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నేడు -స్మృతి వనానికి కాంగ్రెస్ తీర్మానం

కొణిజేటి రోశయ్య

కొణిజేటి రోశయ్య

రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాంధీ భవన్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి మేడ్చల్ జిల్లా దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నది. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

ఇంకా చదవండి ...
తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య ఇక భౌతికంగా కనుమరుగుకానున్నారు. శనివారం ఉదయం నిద్రలోనే కన్నుమూసిన ఆయనకు ఆదివారం నాడు అంత్యక్రియలు జరుగనున్నాయి. రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాంధీ భవన్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి మేడ్చల్ జిల్లా దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నది. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రోశయ్య అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు పలువురు హాజరుకానున్నారు. సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోశయ్య మృతికి తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఏపీ సర్కారు కూడా మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, దాదాపు అందరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల కేబినెట్‌లోనూ మంత్రిగా సేవలందించి.. రికార్డు సృష్టించారు రోశయ్య. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి ఏడుసార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాఠిగా పేరుపొందారు. రోశయ్య 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1968లో తొలిసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980ల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులందరి దగ్గర కీలకమైన శాఖలు నిర్వర్తించారు. 2004లో అసెంబ్లీకి చీరాల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

konijeti rosaiah : వైఎస్సార్‌ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడిని -రోశయ్య సంచలన వ్యాఖ్యలు -viral video



వైఎస్సార్ అనూహ్య మరణంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగాక 2010 నవంబరు 24న తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు. కాగా, దివంగత సీఎం రోశయ్యకు హైదరాబాద్‌లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించింది. ఆ తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌కు పంపుతామన్నారు కాంగ్రెస్‌ నేతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు బొత్స, బాలినేని, వెల్లంపల్లి తదితరులు రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Hyderabad, Rosaiah

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు