ఎట్టకేలకు ఏపీ ఎంసెట్ - 2019 ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ ఫలితాలను రేపు (మంగళవారం) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో...ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంసెట్ ఫలితాల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. గత ఏడాది మే 3ననే ఫలితాలు విడుదల చేశారు. ఈసారి మే 18 తేదీన ఫలితాలను విడుదల చేయాలని భావించినా...ఆ తర్వాత ఫలితాల విడుదలను వాయిదావేశారు. తెలంగాణకు చెందిన దాదాపు 36వేల మందికి పైగా విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాశారు. వీరికి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్ మార్కులు అవసరం కానున్నాయి. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంటోంది.
ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25% వెయిటేజీ ఉంది. మొత్తం 2,82,901 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 1,85,711 మంది హాజరు కాగా.. వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 81,916మంది హాజరయ్యారు. ఏప్రిల్ 20 నుంచి 24వరకు ఎంసెట్ నిర్వహించారు. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. జేఎన్టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్మిట్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* ముందుగా అఫిషియల్ వెబ్సైట్ ‘ఏపీ ఎంసెట్’ లింక్‌పై క్లిక్ చేయండి..
* ఇప్పుడు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్ submit చేయండి..
* వెంటనే స్క్రీన్‌పై రిజల్ట్స్ వస్తాయి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP EAMCET 2019