ఏపీ ప్రజలకు సీఎం జగన్ సడెన్ షాక్..

సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సడెన్ షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై 4.5 శాతం వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: January 30, 2020, 6:38 AM IST
ఏపీ ప్రజలకు సీఎం జగన్ సడెన్ షాక్..
సీఎం జగన్ (File)
  • Share this:
సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సడెన్ షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై 4.5 శాతం వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్‌పై ప్రస్తుతం 31 శాతంగా ఉన్న వ్యాట్ పెంపుతో 32.20శాతానికి పెరిగింది. 22.25 శాతంగా ఉన్న డీజిల్ వ్యాట్ తాజాగా 27 శాతానికి పెరిగింది. వ్యాట్ పెంపు ఫలితంగా పెట్రోల్, డీజిల్‌పై అదనంగా రూ.2 పెరగనుంది. కాకపోతే.. వ్యాట్‌పై అదనంగా వసూలు చేస్తున్న సెస్ రూ.2ను వసూలు చేయొద్దంటూ ఆదేశాల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వ్యాట్‌తో పాటు అదనంగా వసూలు చేస్తున్న రూ.2ను పన్నులోనే కలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టంలో షెడ్యూల్-6ను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏపీ సర్కారు విడుదల చేసిన నోటిఫికేషన్


First published: January 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు