Home /News /trending /

ANY MISTAKES IN YOUR VOTER ID CARD APPLY FOR VERIFICATION AND CORRECTIONS BEFORE SEPTEMBER 30 SS

Voter ID Correction: ఓటరు జాబితాలో తప్పులున్నాయా? సరి చేసుకోవడానికి వారమే గడువు

Voter ID Correction: ఓటరు జాబితాలో తప్పులున్నాయా? సరి చేసుకోవడానికి వారమే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

Voter ID Correction: ఓటరు జాబితాలో తప్పులున్నాయా? సరి చేసుకోవడానికి వారమే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Voter ID Correction | కొత్తగా ఓటు నమోదు చేయాలనుకుంటే ఫామ్-6, ఓటర్ జాబితాలో అడ్రస్ మార్చడానికి ఫామ్-7, మీ వివరాలు తప్పుగా ఉంటే ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.

    ఓటరు జాబితాలో మీ వివరాలు తప్పుగా ఉన్నాయా? మీ పేరు, ఊరు, అడ్రస్ లాంటి వివరాలేవైనా మార్చుకోవాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఒకవేళ ఓటర్ లిస్ట్‌లో మీ వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవచ్చు. అన్ని పోలింగ్ బూత్‌లల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల దగ్గరకు వెళ్లి తప్పులు సరిదిద్దుకోవచ్చు. అంతేకాదు కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయంలోనూ ప్రత్యేక కౌంటర్లుంటాయి. వీటితో పాటు మీ సేవా కేంద్రాల్లోనూ తప్పులు సరిదిద్దుకోవచ్చు. మీ పేరులో తప్పులు ఉన్నా, తల్లి, తండ్రి, భర్త పేరు తప్పుగా ఉన్నా, ఇంటి అడ్రస్‌లో ఏవైనా తేడాలు ఉన్నా వాటిని సరిచేసుకోవచ్చు.

    కొత్తగా ఓటు నమోదు చేయాలనుకుంటే ఫామ్-6, ఓటర్ జాబితాలో అడ్రస్ మార్చడానికి ఫామ్-7, మీ వివరాలు తప్పుగా ఉంటే ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్ బుక్, పాస్‌పోర్ట్, ప్రభుత్వ సంస్థలు లేదా అనుబంధ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, రైతు గుర్తింపు కార్డుల్లో ఏదైనా ప్రూఫ్ చూపించాలి. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్-NVSP ద్వారా కూడా మీరు ఓటరు జాబితాలో మీ వివరాలను సరిచేసుకోవచ్చు. 1950 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి మీ వివరాలను సరిచేయొచ్చు. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు పరిశీలన జరుపుతారు. అక్టోబర్ 15న ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ అవుతుంది. 2020 జనవరిలో తుది జాబితా ప్రచురితమవుతుంది.

    Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

    Reliance Jio Plans: రోజుకు 1.5 జీబీ డేటా... రూ.149 నుంచి రిలయెన్స్ జియో ప్లాన్స్

    IRCTC: ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
    First published:

    Tags: Election Commission of India, Vote, Voter

    తదుపరి వార్తలు