ANUSHKA SHARMA PLAYING LEAD ROLE IN JHULAN GOSWAMI BIOPIC TEASER RELEASE SNR
స్టార్ క్రికెటర్‌గా మారిన స్టార్ హీరోయిన్..ఆ బయోపిక్‌లో అనుష్క ఎలా చేసిందో..!
ANUSHKA SHARMA
Chakda Xpress: బాలీవుడ్ యాక్టరస్ అనుష్కశర్మ లేడీ క్రికెటర్‌గా నటిస్తోంది. టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథను చెక్ దే ఎక్స్‌ప్రెస్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజైంది. అనుష్కశర్మ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటిఫుల్ యాక్టరస్ అనుష్క శర్మ (Anushka Sharma)తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. టీమిండియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) బయోపిక్(Biopic)లో తాను యాక్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అనుష్క. చక్ దే ఎక్స్‌ప్రెస్ (Chakda Xpress)పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ (Teaser)ని రిలీజ్ చేశారు నిర్మాతలు. బాలీవుడ్లో ఇప్పటికే బయోపిక్‌ల హవా జోరుగా కొనసాగుతున్న వేళ..కపిల్ దేవ్ జీవితకథను 83పేరుతో రిలీజై మంచి టాక్ని సొంతం చేసుకుంది. నెక్స్ట్ మరో విమెన్ క్రికెటర్ స్టోరీ సినిమాగా రూపుదిద్దుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. టీమిండియా క్రికెటర్ విరాట్ కొహ్లీ భార్య అనుష్కశర్మ (Anushka Sharma)ఆమె సోదరుడు కర్నేష్ శర్మ (Karnesh Sharma)ఈ చిత్రాన్ని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఝులన్ గోస్వామి పాత్రలో అనుష్కశర్మ నటించారు. చక్ దే ఎక్స్‌ప్రెస్ మూవీని ప్రోశిత్రాయ్ (Prosit Roy)డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్(Teaser)ని ఇన్‌స్టాగ్రమ్(Instagram)లో పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు అనుష్క. చెక్ దే ఎక్స్‌ప్రెస్ మూవీని డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్(Netflix)లో రిలీజ్ చేయనున్నారు.
అనుష్క శర్మలో కొత్త కోణం..
సుమారు ఇరవై ఏళ్ల పాటు ఇండియా విమెన్ క్రికెట్ జట్టుకు విశేష సేవలందించిన ఝులన్ గోస్వామి. జట్టులో మెయిన్ బౌలర్‌గా ఆమె అత్యున్నతమైన ప్రతిభను కనబర్చారు. గతేడాది అన్నీ ఫార్మెట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఝులన్ గోస్వామి. అలాంటి అద్బుతమైన క్రీడాకారిణి జీవిత చరిత్రను తెరకెక్కించడం గొప్ప విశేషం. చక్ దే ఎక్స్‌ప్రెస్ టీజర్‌ని తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో త్యాగాలతో కూడిన అద్భుతమైన కథ అని చెప్పారు.
స్టార్ క్రికెటర్ వైఫ్..క్రికెటర్ రోల్లో..
చెక్ దే ఎక్స్‌ప్రెస్ మహిళల క్రికెట్లో ఇదో కనువిప్పు కలిగే చిత్రంగా నిలుస్తుందని అభిప్రాయాన్ని అనుష్కశర్మ సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఝులన్ గోస్వామి క్రికెటర్ కావాలని నిర్ణయించుకొని ప్రపంచం ముందు భారత జట్టుకు పేరు తేవాలని నిర్ణయించుకున్న సమయంలో ఆడవాళ్లు క్రికెట్ గురించి ఆలోచించడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్న విషయాన్ని అనుష్కశర్మ గుర్తు చేశారు. అలాంటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రపంచ క్రికెటర్ స్ధాయికి ఎలా ఎదిగారో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నామని తెలిపారు అనుష్కశర్మ.
బాలీవుడ్లో బయోపిక్‌ల హవా..
బయోపిక్‌లకు బాలీవుడ్లో గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే టెన్నిస్, బ్యాడ్మింటెన్ స్టార్లు సానియా మీర్జా బయోపిక్‌లో తాప్సీ యాక్ట్ చేయగా, సైనా నెహ్వాల్ బయోపిక్‌లో లీడ్ రోల్‌ని పరిణితిచోప్రా పోషించింది. ఇక ఇప్పుడు అనుష్కశర్మ వంతు వచ్చింది. తన భర్త క్రికెటర్ కావడంతో అనుష్క ఓ విమెన్ క్రికెటర్ జీవిత కథలో యాక్ట్ చేయడమే కాకుండా ఆ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.