#MeToo: ‘మీటూ’ ఎఫెక్ట్...ఇండియన్ ఐడెల్ నుంచి అను మాలిక్ అవుట్!

‘ఆయన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి... నా డ్రెస్ పైకి లేపాడు...’ అంటూ ఆరోపణలు చేసిన డానికా డిసౌజా... ‘ముద్దు పెడితే పాట పాడే ఛాన్స్ ఇస్తా...’ అన్నాడని చెప్పిన బాలీవుడ్ సింగర్లు శ్వేతా పండిట్, సోనా మోహపాత్ర...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 21, 2018, 3:32 PM IST
#MeToo: ‘మీటూ’ ఎఫెక్ట్...ఇండియన్ ఐడెల్ నుంచి అను మాలిక్ అవుట్!
శ్వేతా పండిట్, అను మాలిక్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 21, 2018, 3:32 PM IST
బాలీవుడ్‌ను ‘మీటూ’ మూమెంట్ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలామంది సినీ పెద్దలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొగా... తాజాగా ఆ లిస్టులో బాలీవుడ్ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ కూడా చేరాడు. సూపర్‌హిట్ సింగింగ్ షో ‘ఇండియన్ ఐడెల్’ సీజన్ 5ను ప్రొడ్యూస్ చేస్తున్న సంస్థలో పనిచేసే యువతి, అను మాలిక్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపించింది. ఆ తర్వాత బాలీవుడ్ సింగర్లు శ్వేతా పండిట్, సోనా మోహపాత్ర కూడా అను మాలిక్ అసభ్య ప్రవర్తనను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో పోస్టులు చేశారు. దీంతో అను మాలిక్ చిక్కుల్లో పడ్డాడు.

ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం 1990ల్లో జరిగిన ఓ సంఘటనను ఇలా చెప్పుకొచ్చిందా యువతి. ‘అను మాలిక్‌ను మెహబూబ్ స్టూడియోస్‌లో ఓ మధ్యాహ్నం కలిశాను. అప్పుడాయన ఓ పాటను రికార్డు చేస్తున్నాడు... అతను ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి... నా డ్రెస్ పైకి లేపాడు. అతన్ని సంతృప్తి పరచాలని చెప్పాడు. నేను చేయనని చెప్పాడు. అతను నేను అలా చేయనని, నన్ను వెళ్లనీయమని కోరాను. అతను నా జట్టు పట్టుకుని లాగాడు. గట్టిగా హత్తుకుని నలిపేశాడు...అప్పుడే ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికి రావడంతో తప్పించుకుని పారిపోయా...’ అంటూ చెప్పుకొచ్చింది డానికా డిసౌజా అనే మహిళ. ఈ విషయం ఇండియన్ ఐడెల్ సంస్థ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోలేదని వాపోయింది డిసౌజా..

మరో సింగర్‌కి ఇండియన్ ఐడెల్ 10లో అవకాశం వచ్చినా, అను మాలిక్ జడ్జిగా వ్యవహారిస్తున్నారనే కారణంగా చేయడానికి ఒప్పుకోలేదని, అతని చేతిలో ఆమెకు ఏడేళ్ల కిందట ఎదురైన లైంగిక వేధింపులే అందుకు మెయిన్ రీజన్ అని ఓ కథనం ప్రచురించింది సదరు పత్రిక. ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్వేతా పండిట్ కూడా అను మాలక్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేసింది.





‘2000వ సంవత్సరంలో ఓ పాట పాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ అను మాలిక్‌ను కలిశాను. ఆయన అవకాశం ఇవ్వాలంటే ముందు ముద్దివ్వు... అన్నాడు...’ అంటూ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది శ్వేతా పండిట్.
Loading...
మరో ప్లేబ్యాక్ సింగర్ మోహపాత్ర, అను మాలిక్‌ను ‘సీరియల్ అఫెండర్’ అంటూ సంబోధించింది. ‘ఓవర్ ఫ్రెండ్లీ నేచర్‌తో ఎక్కడెక్కడో తాకుతూ వికృత ఆనందం పొందుతాడు...’ అంటూ అను మాలిక్ చర్యలను తెలుపుతూ పోస్ట్ చేసింది.



వరుసగా అను మాలిక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన్ని ‘ఇండియన్ ఐడెల్’ కార్యక్రమం తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ పాటల రచయిత సమీర్ అంజాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అను మాలిక్ అలాంటివాడు కాదని చెప్పుకొచ్చాడు.


First published: October 21, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...