Home /News /trending /

ANTS CAUGHT ON CAMERA STEALING GOLD CHAIN DUE TO TEAMWORK THE JEWEL WAS TAKEN AWAY VIDEO GOES VIRAL SK

Viral Video: గోల్డ్ చైన్ దొంగతనం చేసిన చీమలు.. ఎంతకు తెగించాయి? వీడియో వైరల్

గోల్డ్ చైన్‌ను తీసుకెళ్తున్న చీమలు

గోల్డ్ చైన్‌ను తీసుకెళ్తున్న చీమలు

Viral Video: చీమలు గోల్డ్ చైయిన్‌ను తీసుకెళ్తున్న వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చీమలు చక్కెర తీసుకెళ్లడం చూశాం గానీ.. ఇలా బంగారం ఎత్తుకెళ్లడం మొదటి సారి చూస్తున్నామని... చాలా మంది కామెంట్లు పెట్టారు.

    ఈ భూమిపై మనుషులతో పాటు ఎన్నో జీవ జాతులున్నాయి. జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాల జీవిస్తున్నాయి. ఐతే ప్రతి దానికి వాటి సొంత స్వభావం, గుర్తింపు ఉంటుంది. పిల్లుల ఎలుకలను వేటాడుతాయి. కుక్కలు ఎముకల కోసం ఎగబడతాయి. సింహం అడవిలో ఇతర జంతువులను వేటాడుతుంది. అలాగే చీమలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. చీమలు ఎంతో కష్టపడతాయి. కష్ట జీవులుగా వీటికి పేరుతుంది. తమ కన్నా ఎక్కువ బరువును మోసుకెళ్తాయి. కలిసి కట్టుగా పనిచేసి... పెద్ద వస్తువులను కూడా ఎత్తుకెళ్తాయి. సాధారణంగా చీమలు పుల్లలు, తిను బండారాలను మోసుకెళ్లడం చాలా సార్లు చూశాం. కానీ బంగారు ఆభరణాలను కాజేయడం చూశారా? కొన్ని చీమలు కలిసి ఏకంగా గోల్డ్ చైయిన్‌నే కాజేసే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    OMG: పిల్లలు చనిపోతే చెట్లుగా మారుతారు... ఇలాంటి సంప్రదాయాన్ని ఎక్కడా చూసి ఉండరు

    ఐఎఫ్ఎస్ సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. చీమల గుంపు బంగారు గొలుసును తీసుకెళ్తోంది. సాధారణంగా ఆహార పదార్థాలను చీమలు ఇలా తీసుకెళ్తుంటాయి. ఐతే ఇక్కడున్న చీమలకు అత్యాశ ఎక్కువయినట్లుంది. బంగారం ఆభరణాలపై మనుసు పారేసుకొని.. ఓ గొలుసును తీసుకెళ్తున్నాయి. ఆ వీడియోకు 'అతి చిన్న గోల్డ్ స్మగ్లర్స్' అని క్యాప్షన్ ఇచ్చారు సుశాంత్ నందా. బంగారం గొలుసును చోరీ చేసినందుకు ఏ ఐపీసీ సెక్షన్ కింద వీటిపై కేసు పెట్టాలి? అని సరదాగా కామెంట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



    చీమలు గోల్డ్ చైయిన్‌ను తీసుకెళ్తున్న వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చీమలు చక్కెర తీసుకెళ్లడం చూశాం గానీ.. ఇలా బంగారం ఎత్తుకెళ్లడం మొదటి సారి చూస్తున్నామని... చాలా మంది కామెంట్లు పెట్టారు. బహుశా..ఆ బంగారం గొలుసుపై తేనె రాసి ఉండవచ్చని.. అందుకే తీసుకెళ్తున్నాయని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. బంగారం పట్ల మగువలే కాదు.. చీమలు కూడా మనసు పారేసుకున్నాయని ఇంకో నెటిజన్ సరదాగా స్పందించాడు. చీమలను అరెస్ట్ చేసి.. జైల్లో వేయాలని ఇంకొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. అమ్మ దొంగల్లారా ఎంతకు తెగించారని..జోకులు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం.. ఆ చీమల స్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ఐక్యమత్యమే బలమని.. ఈ వీడియో ద్వారా మరోసారి నిరూపితమయిందని పేర్కొంటున్నారు. కలిసి కట్టుగా పనిచేస్తే.. ఏదైనా సాధ్యమేనని చీమలు నిరూపించినట్లు అభిప్రాయపడతున్నారు. మొత్తంగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Trending, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు