హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఈ ఫొటోలో ఉన్న జీవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

ఈ ఫొటోలో ఉన్న జీవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

చీమ ఫొటో

చీమ ఫొటో

జీవులను కెమెరా లెన్స్ లేదా మైక్రోస్కోప్ కింద ఉంచడం ద్వారా చూసినప్పుడు వాటి అసలు ముఖం కనిపిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మన చుట్టూ వందలాది జీవులు ఉన్నాయి. అందులో కొన్ని చాలా చిన్నవి, వాటిని సరిగ్గా చూడటం కూడా దాదాపు అసాధ్యం. ఇవి కంటితో తేలికగా కనిపించినప్పటికీ వాటి ఆకారం, శరీర నిర్మాణం, ముఖం మొదలైనవి కళ్లకు కనిపించవు. అలాంటి జీవులను కెమెరా లెన్స్ లేదా మైక్రోస్కోప్ కింద ఉంచడం ద్వారా చూసినప్పుడు వాటి అసలు ముఖం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి జీవి యొక్క ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

లిథువేనియన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ యుజెనిజస్ కవలియాస్కాస్ 2022 నికాన్ స్మాల్ వరల్డ్ ఫోటోమైక్రోగ్రఫీ పోటీలో మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీ కోసం తన చిత్రాన్ని పంపారు. ఆ ఫొటోలో చీమ ఉంది. ఆ చీమ గ్రహాంతర వాసిలా (Ant microscopic photo)కనిపిస్తోంది. పదునైన దంతాలు, కళ్లపై యాంటెన్నాలు, ముక్కు కూడా చాలా రద్దీగా,ఒక గడ్డం లాంటి భాగం కనిపిస్తుంది. ఇది గడ్డం వంటి జుట్టు కలిగి ఉంటుంది. చాలా భయంకరంగా రాక్షసుడు కంటే తక్కువ కాదు అనేట్లుగా ఈచీమ ఫొటో ఉంది.

Flying Car : గాల్లో ఎగిరేకారు వచ్చేసింది..ప్రీ సేల్ ప్రారంభం!

ఇన్‌సైడర్ వెబ్‌సైట్‌తో యుజెనిజస్ మాట్లాడుతూ...తాను అడవికి సమీపంలో నివసిస్తున్నానని, అందువల్ల చీమలు కనిపించడం సాధారణమని, అయితే చీమల సాధారణ ఫోటోలు తనకు నచ్చవని చెప్పాడు. అవి నడుస్తున్న చిత్రాలను తీయడానికి ఇష్టపడలేదని... అందుకే ఏదైనా డిఫరెంట్ గా చేయాలని అనుకుని ఇలాంటి ఫొటోని తీసినట్లు చెప్పారు.. భగవంతుడు సృష్టించిన అందమైన వస్తువులను తాను అభిమానిస్తానని, వాటిని కెమెరాలో బంధించాలనుకుంటున్నానని చెప్పాడు. రెబెక్కా మెక్‌కెండ్రీ అనే మహిళ కూడా ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది, దీనికి 1 లక్షకు పైగా లైక్‌లు, వేలాది రీట్వీట్లు వచ్చాయి.

First published:

Tags: Ants, Viral photo

ఉత్తమ కథలు