కొంత మంది మహిళలు సభ్యసమాజం తలదించు కునే విధంగా ప్రవర్తిస్తుంటారు. పెళ్లయ్యక వివాహేతర సంబంధాలు (extra marital affair) కొనసాగిస్తున్నారు. భర్తకు తెలియకుండా... ఎఫైర్ లు కొనసాగిస్తూ.. తమ పెళ్లికి ఉన్న పవిత్ర బంధాన్ని దిగజారుస్తున్నారు. కొన్ని చోట్ల అక్రమ సంబంధాలు (Illegal affair) పెట్టుకున్నప్పుడు అడ్డంగా దొరికి పోయిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొన్ని చోట్ల.. పిల్లలు ఉండి కూడా, మొగుడితో చిన్నపాటి గొడవలు వచ్చాయని, పుట్టింటికి వెళ్లిపోతున్నారు. అక్కడ ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన మరోసారి వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. మధ్యప్రదేశ్లో (Madhya pradesh) ఈ ఘటన జరిగింది. ఖర్గోన్ జిల్లాలోని కేళి అనే గ్రామంలో.. ఒక వివాహిత తన భర్తతో గొడవలు జరిగాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, అక్కడ భర్తకు తెలియకుండా ఆమె మామతో వివాహేతర సంబంధం వెలగబెడుతుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఇంటికి వెళ్లి చూశాడు. అక్కడ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటాన్ని చూసి, తట్టుకోలేక పోయాడు. వెంటనే తన భార్యను బయటకు లాగి, కొట్టుకుంటూ ఊరేగించాడు.
ఆమె భూజాలపై ఎక్కి కూర్చుని అందరి ముందు అమానుషానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది. అయితే, పోలీసులు రంగంలోనికి దిగి ఐదుగురిని అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితమే ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోనికి వచ్చింది. అప్పుడు మూగ్గురు పిల్లల తల్లి.. భర్తతో విడిపోయి మరో కరితో ఉండగా అడ్డంగా దొరికిపోయింది. ఆమెను కూడా ఇలాగే కొట్టుకుంటూ ఊరేగించారు. అప్పుడు కూడా వీడియో వైరల్ గా (video viral) మారిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఒక వ్యక్తి తాగి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు.
ముంబైలో (Mumbai) కొన్ని రోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్ని (Heavy rain) నీళ్లతో నిండిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అసలే.. రోడ్లపై నిలిచిలపోయిన నీళ్లు., ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతుంటే ఒక వ్యక్తి పూటుగా మద్యం తాగాడు.రోడ్డు మీద బురదలో పడుకున్నాడు. అదేదే స్విమ్మింగ్ పూల్ లో పడుకుంటున్నట్లు అటు ఇటు బోర్లు తున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న వాహనాల వలన నీళ్లు అతని ఒంటిమీద పడుతున్న ఏమాత్రం తెలియకుండా అలాగే పడుకుని ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.