• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • ANOTHER CONTROVERSY AFTER AYODHYA RAM MANDIR LORD SRI KRISHNA IDOLS BURIED IN AGRA JAMA MASJID FULL DETAILS HERE HSN GH

PIL in Mathura court: మరో వివాదం.. ఆగ్రాలోని జామా మసీదు మెట్ల కింద కృష్ణుడి విగ్రహాలు..? నిజాలు తేల్చాలని మధుర కోర్టులో పిల్

PIL in Mathura court: మరో వివాదం.. ఆగ్రాలోని జామా మసీదు మెట్ల కింద కృష్ణుడి విగ్రహాలు..? నిజాలు తేల్చాలని మధుర కోర్టులో పిల్

Thakur Katra Keshav Dev temple

ఎన్నో ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా నడిచిన అయోధ్య రామ మందిరం వివాదానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ సారి కృష్ణుడి విగ్రహాలకు సంబంధించిన అంశం గురించి కోర్టులో పిటిషన్ దాఖలయింది.

  • Share this:
అయోధ్యలోని రామ మందిరం వివాదం ఎన్నో ఏళ్ల తరువాత ముగిసింది. ఆ తరువాత గత వారం కాశీ విశ్వనాథుడి ఆలయం పరిధిలోని మసీదు పూర్వపరాలను తేల్చాలని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మధురలోని కృష్ణుడి విగ్రహాలకు సంబంధించిన మరో వివాదం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగ్రాలోని జామా మసీదు కింద ఠాకూర్ కత్ర కేశవ్ దేవ్ (కృష్ణుడి జన్మస్థలం) ఆలయానికి చెందిన కృష్ణుడి విగ్రహాలు పూడ్చి పెట్టారని మధురలోని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మసీదు కింద విగ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) గ్రౌండ్ రేడియాలజీ పరీక్ష నిర్వహించాలని ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు. లక్నోకు చెందిన శైలేంద్ర సింగ్ అనే లాయర్, ఐదుగురు పిటిషనర్ల తరఫున ఈ పిల్ దాఖలు చేశారు.

కృష్ణుడి పుట్టిన రోజుకు సంబంధించిన వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘శ్రీ కృష్ణుడు విష్ణువు అవతారం. ఆయన 5132 సంవత్సరాల క్రితం భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి రోజున జన్మించారు. ద్వాపర యుగంలో మధురలోని ఒక జైలులో, కత్ర కేశవ్ దేవ్ అనే ప్రదేశంలో మానవ రూపంలో పుట్టారు. హిందువులు దేవుళ్లు జన్మించిన ప్రదేశాల్లో గుడి కట్టి ఆరాధిస్తారు. కత్ర కేశవ్ దేవ్ ప్రాంతంలో కృష్ణుడికి ఆలయం నిర్మించారు’ అని తెలిపారు. ‘బుందేల్ రాజు వీర్‌ సింగ్ దేవ్ రూ. 33 లక్షలతో మధురలోని కృష్ణుడి జన్మ స్థానంలో కేశవ్ దేవ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ మందిరాన్ని 1670 జనవరిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశారు. ఇక్కడ ఒక మసీదు లేదా ఈద్గాను నిర్మించారు. గుడిలోని విగ్రహాలను ఆగ్రాకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మించిన జహనారా మసీదు (జామా మసీదు) మెట్ల కింద వాటిని పాతిపెట్టారు. మసీదులో ప్రార్థనలు చేయడానికి వెళ్లే ముస్లింలు అందరూ విగ్రహాలను తొక్కుకుంటూ వెళ్లాలనే ఉద్దేశంతో ఇలా చేశారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మసీదు మెట్ల కింద విగ్రహాలు ఉన్నాయో లేదో తేల్చాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలని పిటిషనర్ కోరారు.

ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

ఇటీవల కాశీ విశ్వనాథుడి ఆలయం పరిధిలో ఉన్న జ్ఞాన్వపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియలాజికల్ సర్వే సంస్థ పరిశోధనలు చేయడానికి వారణాసి జిల్లా కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వచ్చిన వారం రోజుల తరువాత మధుర కోర్టులో తాజా పిటిషన్ దాఖలు కావడం విశేషం. ఇక్కడి మసీదు.. ఆలయంలో ఒక భాగమని లాయర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జ్ఞాన్వపి మసీదు నిర్మించడానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయంలో కొంత భాగాన్ని కూల్చివేసినట్లు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ తీర్పును స్థానిక వక్ఫ్ బోర్డు కోర్టులో సవాల్ చేసింది.

ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్
Published by:Hasaan Kandula
First published: