ANIMAL PARK CHANGES PIG NAME FROM VLADIMIR PUTIN PVN
Trending : ఆ పంది పేరు పుతిన్..పాపం దాని కష్టాలు పగ వాడికి కూడా రాకూడదు!
పుతిన్ పేరు ఉన్న అడవి పంది ఇదే
Pig name change from Vladimir Putin : పుతిన్...ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు తెలియన వారు కొద్ది మంది మాత్రమే ఉంటారేమో. దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తోన్న రష్యా దేశానికి అధ్యక్షుడైన పుతిన్ పేరు గతంలోనే పాపులర్ అయినప్పటికీ..ఉక్రెయిన్రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి మరింత పాపులర్ అయింది.
Pig Name Vladimir Putin : పుతిన్...ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు తెలియన వారు కొద్ది మంది మాత్రమే ఉంటారేమో. దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తోన్న రష్యా దేశానికి అధ్యక్షుడైన పుతిన్ పేరు గతంలోనే పాపులర్ అయినప్పటికీ..ఉక్రెయిన్-రష్యా(Russia-Ukraine War) యుద్ధం మొదలైన నాటి నుంచి మరింత పాపులర్ అయింది. అమెరికా,యూరోపియన్ దేశాల ఆంక్షలను కూడా లెక్కచేయకుండా తాను అనుకున్నది నేరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు పుతిన్(Putin).ఉక్రెయిన్ ను తన కంట్రోల్ లోకి తీసుకోవడానికి ఆ దేశంపై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. అయితే పుతిన్ పేరు చెబితే అమెరికా,యూరప్ లోని చాలా దేశాల్లోని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి కారణంగా ఉక్రెయిన్ యుద్ధం,ఉక్రెయిన్ లో రష్యా సృష్టిప్తున్న మరణహోమం. అయితే ఇదిలా ఉండగా..తాజాగా పుతిన్ పేరుతో ఉన్న ఓ అడవి పందికి పెద్ద కష్టాలే ఎదురయ్యాయంట. దీంతో ఆ పందికి పేరు మార్చవలసి వచ్చింది.
జర్మనీలోని బవేరియాలో ఓ జంతువుల పార్క్(Animal Park) ఉంది. అందులో ఉండే ఓ అడవి పంది (Wild Boar)పుతిన్. అయిదే దానికి ఆ పేరు ఇప్పడు కొత్తగా పెట్టిందేమీ కాదు. మూడేళ్ల నుంచే దానిని ఆ పేరు ఉంది. ఆ పంది రష్యాకి సంబంధించిన ప్రత్యేక పంది జాతికి వారసురాలు కావడం వల్లనే గుర్తు కోసం వ్లాదిమిర్ పుతిన్ అని పేరు పెట్టారు. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి పార్కుకు వస్తున్న వారు ఆ పంది గురించి తెలుసుకొని "పుతిన్ పుతిన్" అని పిలుస్తూ రష్యా అధ్యక్షుడిపై ఉన్న కోపాన్ని తీర్చుకుంటున్నారు. కొందరయితే దానిపై దాడికి కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పార్కుకు వచ్చే వారిలో కొంతమంది ఉక్రెయిన్ వాసులున్నారు. వారంతా జర్మనీకి శరణార్థులుగా వచ్చారు. వారు ఈ పార్కుకు వచ్చినప్పుడు పుతిన్ పై ఉన్న ఆగ్రహాన్ని పందిపై చూపిస్తున్నారు. ఈ రాజకీయాలేవీ తెలియని ఆ మూగజీవి అన్నింటినీ మౌనంగా భరిస్తూ వస్తోంది. మరో విషమేమిటంటే సందర్శకులకు ఆ పంది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల పుతిన్ అనే పేరు పార్కులో వినిపిస్తే చాలు... అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. రష్యా అధ్యక్షుడైన పుతిన్ పేరును ఆ పందికి అలాగే ఉంచితే అది లేనిపోని సమస్యలకు దారి తీస్తుంది అని భావించిన పార్క్ అధికారులు మంగళవారం హడావుడిగా ప్రత్యేక కార్యక్రమం జరిపించి దాని పేరును తొలగించారు.
నిజానికి ఈ పేరు మార్చాలి అనే అంశం కొన్ని రోజులుగా చర్చల్లో ఉంది. అడవి పందికి కొత్తగా ఏం పేరు పెట్టాలి అని ఆలోచించిన అధికారులు అందుకోసం సోషల్ మీడియాలో ఓ కంటెస్ట్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో దాదాపు 3,000 మంది నెటిజన్ల సూచనలతో ఇప్పుడు ఆ అడవి పందిని ఎబర్హోఫర్ అని పేరుతో పిలుస్తున్నారు. దీంతో ఇకపై ఆ పందిని పుతిన్ అని పిలవడానికి వీలు లేదు. ఇలా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం పందికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది.అయితే ఈ పంది పేరు మార్పు అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పార్క్ ఆపరేటర్ ఎక్కార్డ్ మిక్కిష్ మాట్లాడుతూ..ఆ పంది మూడేళ్ల కిందట ఈ పార్కుకు వచ్చినప్పుడు దానికి రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ పేరు పెట్టాం. అది 200 కేజీల రష్యా హాగ్ ప్యూర్ బ్రెడ్. జర్మనీలో కనిపించే అడవి పందుల కంటే... అది మూడు రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితుల్లో దాని పేరుని ఎబర్ హోఫర్ గా మార్చాం. ఇకపై దానిని పుతిన్ పేరుతో ఎవరూ పిలవరని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.