హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Mayan Pyramid : మయన్ పిరమిడ్ ఎక్కిన మహిళపై దాడి.. వీడియోలు వైరల్

Mayan Pyramid : మయన్ పిరమిడ్ ఎక్కిన మహిళపై దాడి.. వీడియోలు వైరల్

పిరమిడ్ ఎక్కినందుకు దాడి (image credit - twitter - davenewworld_2 and ElGab)

పిరమిడ్ ఎక్కినందుకు దాడి (image credit - twitter - davenewworld_2 and ElGab)

Mayan Pyramid : ప్రపంచ చారిత్రక సంపదల్లో ఒకటైన మయన్ పిరమిడ్‌పైకి ఆమె ఎలా వెళ్లింది? ఆమెను ఎవరూ ఎందుకు ఆపలేదు? పర్యాటకులు ఎందుకు దాడి చేశారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Mayan Pyramid : నిజంగా ఇదో దురదృష్ట ఘటనే.. వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. కొంతమంది మాత్రం వాటిని నాశనం చేస్తుంటారు. అలా ఓ మహిళ చేసిన నిర్వాకం.. పర్యాటకుల ఆగ్రహానికి కారణమైంది. మెక్సికో (Mexico)లోని మయన్ పిరమిడ్ (Mayan pyramid) ఎక్కిన ఆమె.. అక్కడ అసభ్యంగా డాన్స్ చేసింది. మెట్లతో ఎత్తుగా ఉండే ఎల్ కాస్టిల్లో (El Castillo) పిరమిడ్.. మయన్లకు దైవ సమానం. సూర్యుడిని పూజిస్తూ వారు ఆ పిరమిడ్‌ని నిర్మించుకున్నారు. అలాంటి దానిపైకి ఎక్కి.. అసభ్యంగా ప్రవర్తించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

  ఈ పిరమిడ్ పురాతత్వ ప్రదేశమైన యుకాటాన్‌లోని చిచెన్ ఇట్జాలో ఉంది. ఆమె కిందకు దిగాలని పర్యాటకులు డిమాండ్ చేశారు. కిందకు దిగిన తర్వాత ఆమెపై వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  పిరమిడ్ ఎక్కిన వీడియోని ఇక్కడ చూడండి (viral video)

  పర్యాటకుల నుంచి పురాతత్వ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయినప్పటికీ పర్యాటకులు ఆమెపై దాడి చేశారు. ఆమె టోపీని లాగేశారు. ఆ దాడి వీడియోని ఇక్కడ చూడండి (attack video)

  ఈ ఘటనను చాలా మంది తమ మొబైళ్లతో రికార్డ్ చేశారు. చాలా మంది ఆమెను లాకప్‌లో పెట్టాలనీ, జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ.. స్పానిష్ భాషలో నినాదాలు చేశారు.

  దీనిపై అధికారులు స్పందించారు. ఇలాంటి పురాతన కట్టడాల్ని దగ్గరకు వెళ్లి చూడొచ్చుగానీ.. వాటి పైకి ఎక్కడం, వాటిని నాశనం చేయడం కరెక్టు కాదని సూచించారు. రిపోర్టుల ప్రకారం.. ఆ పిరమిడ్ ఎక్కేందుకు పర్యాటకులకు వీలు లేదు. దీనికి సంబంధించి.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (INAH) సంస్థ నిషేధాజ్ఞలు ఉన్నాయి. 2006 జనవరిలో 80 ఏళ్ల ఓ ముసలావిడ.. 91 ఏళ్ల ఆ పిరమిడ్ ఎక్కింది. అప్పట్లో అందరూ ఎక్కేవారు. ఐతే.. ఆ ముసలామె.. పైకి ఎక్కాక అక్కడి నుంచి జారి పడి చనిపోయింది. అప్పటి నుంచి.. ఆ పిరమిడ్ ఎవరూ ఎక్కకుండా నిషేధం విధించారు.

  Sad News : పుట్టగొడుగుల కూర తిని చనిపోయిన తండ్రి, కొడుకు..

  ప్రపంచంలో ఈజిప్షియన్లకు ఎలాగైతే ప్రత్యేక నాగరికత ఉందో.. మయన్లకు కూడా అలాగే ఉంది. వారు సూర్యుణ్ని పూజిస్తూ.. భవిష్యత్తును అంచనా వేసేవారు. వారి బొమ్మల భాషకు అర్థాలు ఇప్పటికీ తెలియవు. కానీ వారు భవిష్యత్తును కరెక్టుగా ఊహించేవారని కొందరు చెబుతున్నారు. రకరకాల రహస్యాలతో కూడిన వారి సంస్కృతిని కాపాడేందుకు యునెస్కో సహా చాలా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయినా అప్పుడప్పుడూ ఇలాంటి టూరిస్టులు.. పురాతన కట్టడాలకు హాని చేస్తున్నారు.

  Published by:Kumar Krishna
  First published: