హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video : ఏనుగును రెచ్చగొట్టారు.. ఫలితం ఏమైందో వీడియో చూడండి

Viral video : ఏనుగును రెచ్చగొట్టారు.. ఫలితం ఏమైందో వీడియో చూడండి

ఏనుగుకి కోపం వస్తే (image credit - twitter - ANI)

ఏనుగుకి కోపం వస్తే (image credit - twitter - ANI)

Viral video : ఏనుగు అంటే అందరికీ ఇష్టమే. భారీకాయం, తొండంతో ఇట్టే ఆకట్టుకుంటుంది. కానీ కోపం వస్తే పరిస్థితి కంట్రోల్ తప్పుతుంది. ఓ ఏనుగును రెచ్చగొట్టడం వల్ల ఏం జరిగిందో వీడియో చూద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మన దేశంలో ఏనుగులు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో కేరళ, అసోం ముందుంటాయి. అసోంలో అడవులు ఎక్కువ. తరచూ ఏనుగులు.. జనావాసాల వైపు వస్తూ ఉంటాయి. తాజాగా అక్కడి గోల్పారాలోని రాంగ్‌జులిలో సాయంత్రం వేళ కొన్ని ఏనుగులు గుంపుగా.. జనావాసాల వైపు వచ్చాయి. జనరల్‌గా ఇలా వచ్చే గజాలు ఎవరి జోలికీ రావు. గుంపుగా నడుస్తూ మళ్లీ అడవిలోకి వెళ్లిపోతాయి. ఈసారి మాత్రం అవి పంటపొలాలలోకి వెళ్లి నాశనం చేశాయి. ఆహారం కోసం అవి అలా చేశాయి. అది చూసిన స్థానికులు.. ఎలాగైనా వాటిని తరిమేయాలి అనుకున్నారు.

ప్రజలు అరుస్తుండటంతో.. ఏనుగులు తిరిగి అడవిలోకి వెళ్లిపోవడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో ఒక ఏనుగు మాత్రం గుంపు నుంచి దూరంగా ఉంది. దాన్ని కూడా పంపాలనే ఉద్దేశంతో వెంటపడ్డారు. దాంతో ఆ గజానికి ఆగ్రహం కలిగింది. వెళ్లిపోయేది కాస్తా వెనక్కి తిరిగి.. ప్రజల వెంట పడింది. దాంతో.. స్థానికులు తలో దిక్కుకూ పరుగులు పెట్టారు. గట్టిగా అరుస్తూ ఆ ఏనుగు వారిని హడలెత్తించింది. ఆ తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

ఏనుగును రెచ్చగొట్టడం తప్పే. అవి వన్యమృగాలు. కోపం వస్తే మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడవు. ఐతే.. కొన్ని సందర్భాల్లో ఏనుగులు చనిపోతున్నాయి. ఈమధ్య గోల్పారా జిల్లాలోని ఓ తోటలో ఏనుగు కళేబరం కనిపించింది. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి చూశారు. అది మామూలుగా చనిపోయింగా, ఎవరైనా చంపేశారా అన్నది తెలియలేదు.

Time Traveller : టైమ్ ట్రావెలర్ అంట.. ఫిఫా వరల్డ్ కప్‌లో గెలిచేదెవరో చెప్పాడు

ఆహారం కోసం ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఉంటుందన్న లఖింపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ధ్రుబా దత్తా.. ఎందుకు చనిపోయిందో తెలుసుకుంటామన్నారు. ఆ పొలం దగ్గర కరెంటు సరఫరా లేదు. అందువల్ల అది కరెంటు షాక్‌తో చనిపోలేదని తెలిపారు.

First published:

Tags: Trending video, Trending videos, Viral, Viral Video

ఉత్తమ కథలు