Angelina jolie: ఏంజెలినా జోలి సంచలన నిర్ణయం.. అఫ్ఘాన్​ల కోసం నిలబడుతానంటున్న హాలీవుడ్​ నటి

ఏంజెలినీ జోలీ తొలి పోస్టు (ఫొటో: ఇన్​స్టాగ్రామ్​)

పలువురు సెలెబ్రెటీలకూ ఏంజెలినా జోలి రోల్​మోడల్​. ఇప్పటివరకు కనీసం తనకు ఇన్​స్టాగ్రామ్(Instagram)​ అకౌంట్​ కూడా లేదు. అయితే ఒక్కసారిగా ఈ నటి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ తెరిచి, సంచలన ప్రకటన చేసింది. కారణం.. ఓ ఉత్తరం(letter).. ఈ ఉత్తరం తనను కదిలించిందని ఆమె చెప్పింది.

  • Share this:
    ఏంజెలినా జోలి(Angelina jolie). హాలీవుడ్​(Hollywood)లో ప్రఖ్యాత నటి(actress). సినిమాల్లో నటిస్తున్నా.. బాహ్య ప్రపంచానికి, వివాదాలకు ఎక్కువగా దూరంగానే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏంజెలినాకు కోట్లాది మంది అభిమానులు(fans) సైతం ఉన్నారు. పలువురు సెలెబ్రెటీలకూ ఆమె రోల్​మోడల్​. ఇప్పటివరకు కనీసం తనకు ఇన్​స్టాగ్రామ్(Instagram)​ అకౌంట్​ కూడా లేదు. అయితే ఒక్కసారిగా ఈ నటి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ తెరిచి, సంచలన ప్రకటన చేసింది. కారణం.. ఓ ఉత్తరం(letter).. ఈ ఉత్తరం తనను కదిలించిందని చెప్పింది ఆమె. ఇంతకీ ఆ ఉత్తరం ఎవరు రాశారు. ఇన్నేళ్లలో సోషల్​మీడియా అకౌంట్​ క్రియేట్​ చేయకుండా కేవలం ఆ ఉత్తరం కారణంగానే అకౌంట్​ ఓపెన్​ చేసిందంటే.. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది. తెలుసుకుందాం..

    “నేనొక అఫ్ఘాన్ యువతిని, తాలిబన్లు రాకముందు మేమంతా ఉద్యోగాలు చేసుకొనేవాళ్లం, పాఠశాలలకు వెళ్లేవాళ్లం. మాకు హక్కులు ఉండేవి. తాలిబన్లరాకతో అంతా మారిపోయింది. వారిని చూసి భయపడుతున్నాం. మా కలలన్నీ కల్లలయ్యాయి. హక్పులు కోల్పోయాం. బయటికి రాలేని పరిస్థితి. చదువులు, ఉద్యోగాల సంగతి చెప్పక్కర్లేదు. తాలిబన్లు మారారని కొందరు చెబుతున్నారు. నేనలా భావించడం లేదు. ఇప్పుడు మా జీవితాలు చీకటి మయమయ్యాయి. స్వేచ్ఛను కోల్పోయాం. మళ్లీ మేం బందీలైపోయాం".. అవును ఆ ఉత్తరంలో రాసి ఉన్న వాక్యాలవి. రాసింది ఓ అఫ్ఘాన్​ యువతి(lady). అంతే ఉత్తరం చదివి చలించిపోయింది ఏంజెలినా. తాలిబాన్ల(Talibans) చెరలో చిక్కిన అఫ్ఘాన్ల తరఫున సోషల్‌మీడియా (social media) వేదికగా పోరాడతానని, వారి గళాన్ని ప్రపంచానికి వినిపిస్తానని హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలి అన్నారు. ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో ఖాతానే లేని ఆమె.. ఇందుకోసమే ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్​లో ఖాతా తెరిచారు.




    ‘‘అఫ్ఘనిస్తాన్​(Afghanistan )వాసులు సోషల్‌మీడియా ద్వారా తమ బాధలను పంచుకునే అవకాశాన్ని కోల్పోయారు. అందుకే ఈ ఖాతాను వారి కే అంకితం చేస్తున్నా. దీని ద్వారా అఫ్ఘాన్‌ పౌరులు, శరణార్థుల బాధలను ప్రపంచానికి తెలియజేస్తా’’ అని ఏంజెలినా(Angelina) తెలిపారు. ఓ అఫ్ఘాన్‌ బాలిక(girl) రాసిన లేఖతో చలించిపోయానని చెప్పిన ఆమె.. దాన్ని ఇన్‌స్టాలో షేర్‌ hollyచేశారు. వారికోసం, వారి మానవ హక్కుల(human rights) కోసం సోషల్​మీడియా వేదికగా నిలబడుతానంది. ఇన్‌స్టాలో ఖాతా ప్రారంభించిన వెంటనే ఏంజెలినా జోలికి 68 లక్షల మంది ఫాలోవర్లు రాగా.. తొలి పోస్టుకి 29 లక్షల లైక్స్‌ వచ్చాయి.
    Published by:Prabhakar Vaddi
    First published: