• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • ANDROGYNOUS FASHION IS WINNING THE INTERNET HERE IS THE REASON AK GH

Androgynous Fashion: ఆండ్రోజినస్ ఫ్యాషన్‌ అంటే ఏమిటి?.. దీనిపై సోషల్​ మీడియాలో ఎంతకంత చర్చ

Androgynous Fashion: ఆండ్రోజినస్ ఫ్యాషన్‌ అంటే ఏమిటి?.. దీనిపై సోషల్​ మీడియాలో ఎంతకంత చర్చ

చీరలో పుష్పక్ ( Image: Facebook)

కోల్​కత్తాకి చెందిన పుష్పాక్ సేన్ అనే వ్యక్తి చీరతో అలంకరించుకొని.. ఆ ఫోటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేయడంతో వార్తల్లో నిలిచాడు.

  • Share this:
లింగ మార్పిడి స్వేచ్ఛ గురించి ఈ మధ్య కాలంలో బాగా చర్చ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆండ్రోజినస్ ఫ్యాషన్ అనే సంస్కృతి విస్తరిస్తోంది. మగవారు ఆడవారి వేశధారణ, ఆడవారు మగవారి వేశధారణ.. ఇలా వారికి నచ్చిన రీతిలో జీవించేందుకు ఇష్టపడుతున్నారు. సంస్కృతి, కట్టుబాట్లను సైతం
దిక్కరించి వారి వ్యక్తిగత అభిప్రాయాలకే పెద్ద పీఠ వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా, కోల్​కత్తాకి చెందిన పుష్పాక్ సేన్ అనే వ్యక్తి చీరతో అలంకరించుకొని.. ఆ ఫోటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేయడంతో వార్తల్లో నిలిచాడు. అతను గ్రీన్​ కలర్, రెడ్​ లిప్​స్టిక్​తో అచ్ఛం ఆడవారిలాగే అలంకరించుకొని ఏప్రిల్ 15న జరిగిన బెంగాలీ నూతన సంవత్సర వేడుకల్లో
భాగంగా ఫేస్‌బుక్​లో పోస్ట్ చేశాడు.

దీనిపై పుష్కప్​ సేన్​ మాట్లాడుతూ “నాకు నచ్చిన విధంగా చీర ధరించాను. మేకప్‌లో మునిగిపోయాను. చిత్రాలు క్లిక్ చేశాను. అయితే, ఫోటో షూట్​లో పాల్గొన్నాను. నేను మగవాడినే అయినప్పటికీ, ఆడవారి వస్త్రాధారణ అంటే ఇష్టం. నా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగానే ఇలా చేశాను. అంతేకాక, దీనితో సమాజానికి సంకేతం ఇవ్వాలనుకున్నాను.” అని పేర్కొన్నాడు. కాగా, పుష్పాక్ ఫోటోలపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. కొంతమంది పుష్కక్​ తనకు నచ్చినట్లుగా ఉంటున్నాడు.. దీన్ని స్వాగించాలి తప్ప వ్యతిరేకించాల్సిన అవసరం లేదంటూ చాలా ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక నెటిజన్​
‘చీరకట్టులో పుష్కక్​​ను చూసి ‘నా కళ్లు తిప్పుకోలేక పోతున్నా’ అంటూ కామెంట్​​
చేశాడు. మరొకరు “మీరు చాలా అద్భుతంగా ఉన్నారు! అంటూ వ్యాఖ్యానించాడు.

కాగా, తాను ఎర్రటి లిప్‌స్టిక్‌ పెట్టుకోవడంపై పుష్కక్​ స్పందిస్తూ.. “54 ఏళ్ల వయసున్న నా తల్లి లిప్​స్టిక్​ పెట్టుకున్నందుకు, మా దగ్గరి బంధువుల నుంచి అవమానాలు ఎదుర్కొంది. కాబట్టి వారందరికీ గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందువల్లే నా పెదాలకు ఎర్రటి లిప్​స్టిక్​ పెట్టుకొని ఆ ఫోటోలను గుడ్​ మార్నింగ్​, గెట్​ వెల్​ సూన్​ అని చెప్పి వారికి పంపాను. కాగా, కోల్​కతాకు చెందిన పుష్పక్​ సేన్​ ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నాడు. గత కొంత కాలం నుచి సోషల్ మీడియాలో ఆండ్రోజినస్ ఫ్యాషన్ ఉద్యమంగా అభివృద్ధి చెందుతుంది. రణ్‌వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, అప్రశక్తి ఖురానా, జిమ్ సర్బ్
వంటి నటులు సైతం దీన్ని స్వాగతిస్తూ.. వారి ఫ్యాషన్‌పై ప్రయోగాలు
చేస్తున్నారు.

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు నయా ట్రెండ్​..
కాగా, గత సంవత్సరం, పాప్ సింగర్ హ్యారీ స్టైల్స్ ఒక జాకెట్‌ ధరించి కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారి దుస్తులు ధరించడం చాలా ఇష్టం. ఈ విషయంలో నేను డేవిడ్ బౌవీ, ఫ్రెడ్డీ మెర్క్యురీ, జాన్ ఎల్టన్ వంటి బ్రిటిష్ ప్రముఖుల నుండి ప్రేరణ పొందాను.” అని తెలిపాడు. ఇదే తరహాలో జర్మనీకి చెందిన మార్క్ బ్రయాన్​ అనే రోబోటిక్ ఇంజినీర్ కూడా విభిన్నమైన వస్త్రాలు ధరించి వార్తల్లోకి ఎక్కాడు. ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న మార్క్ బ్రయాన్.. తాను భిన్నంగా దుస్తులు ధరించడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా, విస్తృతంగా ఆమోదించబడిన ఆండ్రోజినస్ ఫ్యాషన్​పై ఇప్పుడు పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఆడవారిలా హీల్​ బూట్లు ధరించిన ఫోటోలపై ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే.
First published:

అగ్ర కథనాలు