చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణాలు... జగనన్న తోడు పథకానికి అర్హతలివే

Jagananna Thodu Scheme | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10,000 వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. అర్హతలు ఏంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 9, 2020, 12:37 PM IST
చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణాలు... జగనన్న తోడు పథకానికి అర్హతలివే
చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణాలు... జగనన్న తోడు పథకానికి అర్హతలివే (image: AP CMO / Twitter)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం 'జగనన్న తోడు' పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే కూడా మొదలైంది. ఈ సర్వే జూలై 16న ముగుస్తుంది. జూలై 23 లోగా అర్హుల జాబితాను ప్రకటించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకం ప్రారంభించింది. తోపుడు బండ్లపై, బుట్టల్లో సరుకులు అమ్మేవారు, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసేవారు, సైకిల్, వాహనాలపై వస్తువులు అమ్మేవారు, కొండపల్లి, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు లాంటి సంప్రదాయ హస్తకళలపై ఆధారపడేవారికి వడ్డీ లేని రుణాలు లభించనున్నాయి. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా వేస్తోంది. జూలై 16 లోగా సర్వే ముగించి జూలై 23 లోగా గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రకటించనుంది.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 723 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 426 పోస్టులు... ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ

జగనన్న తోడు పథకం లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలపై ఇప్పటికే నియమనిబంధనలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పథకానికి దరఖాస్తు చేసేవారి వయస్సు 18 ఏళ్ల పైనే ఉండాలి. నెలవారీ ఆదాయం గ్రామాల్లో రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 లోపు ఉండాలి. మాగాణి 3 ఎకరాలు లేదా మెట్టభూములు 10 ఎకరాలు, మెట్ట, మాగాణి భూములు కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారు అర్హులు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు లాంటి ఐడీ ప్రూఫ్ తప్పనిసరి. 5x5 అడుగుల స్థలం లేదా అంతకన్నా తక్కువ స్థలంలో వ్యాపారుల చేస్తున్నవారు అర్హులు. జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.10,000 రుణాలు పొందాలనుకునే చిరు వ్యాపారులు గ్రామ వాలంటీర్లను లేదా గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 9, 2020, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading