AP ECET: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల... ఫలితాలు ఇలా చూడండి

ఫలితాలతోపాటు తుది ఆన్సర్ 'కీ'ని కూడా విడుదల చేశారు. జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న నిర్వహించిన ఏపీఈసెట్‌-2019 పరీక్షలకు 37,749 మంది విద్యార్థులు హాజరయ్యారు.

news18-telugu
Updated: May 13, 2019, 12:45 PM IST
AP ECET: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల... ఫలితాలు ఇలా చూడండి
ఈసెట్ ఫలితాలను విడుదల చేస్తున్న అధికారులు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌‌లో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఈసెట్-2019 ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. ధ్యాహ్నం 12 గంటలకు సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విజయవాడలో ఏపీ ఈసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. 37,066 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. మే 19 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.ఈసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ sche.ap.gov.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు తుది ఆన్సర్ 'కీ'ని కూడా విడుదల చేశారు. జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న నిర్వహించిన ఏపీఈసెట్‌-2019 పరీక్షలకు 37,749 మంది విద్యార్థులు హాజరయ్యారు మే 1న ఈసెట్ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 3 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం మే 13న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న టెన్త్ రిజల్ట్స్‌ను తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18. మొత్తంగా పాస్ పర్సంటేజీ 92.43గా నమోదైంది.

First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...