నేడు జగనన్న పచ్చ తోరణం... కోట్ల మొక్కల పెంపకం... ఇవీ ప్రత్యేకతలు...

తెలంగాణ ప్రభుత్వం హరితహారంతో గ్రీనరీని పెంచుతుంటే... ఏపీ ప్రభుత్వం కూడా అదే రూట్ ఫాలో అవుతూ... భారీ సంఖ్యలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుడుతోంది.

news18-telugu
Updated: July 22, 2020, 6:01 AM IST
నేడు జగనన్న పచ్చ తోరణం... కోట్ల మొక్కల పెంపకం... ఇవీ ప్రత్యేకతలు...
నేడు జగనన్న పచ్చ తోరణం... కోట్ల మొక్కల పెంపకం... ఇవీ ప్రత్యేకతలు... (File)
  • Share this:
మనమంతా ఆరోగ్యంగా... స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుతూ... ఎలాంటి రోగాలూ లేకుండా బతకాలంటే... మన చుట్టూ మొక్కలు చెట్లూ ఉండాలి. ప్రకృతిలో ఉన్నంతకాలం మనకు ఎలాంటి అనారోగ్యాలూ రావు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నట్లే... ఇండియాతోపాటూ... తెలుగు రాష్ట్రాలూ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. ఇప్పటికే... తెలంగాణలో హరితహారం పేరుతో ఆరేళ్లుగా కోట్ల మొక్కల్ని పెంచుతున్నారు. వాటిలో చాలావరకూ చెట్లుగా మారి... తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో... వైసీపీ ప్రభుత్వం అందరం మొక్కలు నాటి... చెట్లను పెంచుదాం అనే నినాదం అందుకుంది. ఇందులో భాగంగా.. ఇవాళ 71వ వన మహోత్సవాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించబోతున్నారు.

కేబినెట్‌లోకి వస్తున్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగా సీఎం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా... మొక్కలు నాటడాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి ఇందులో పాల్గొంటారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం అన్నీ రెడీ చేసింది. ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా, అందరూ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపేలా ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసుకుంది.

పర్యావరణ నిబంధనల ప్రకారం... ఏ దేశంలోనైనా 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. ఆ దిశగా అన్ని రాష్ట్రాలూ పచ్చదనాన్ని పెంచాలి. ఇప్పటివరకూ మనం ఆ టార్గెట్ చేరుకోలేదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పచ్చదనంపై ఆసక్తి పెరుగుతోంది. అందువల్ల త్వరలోనే ఇండియా ఈ టార్గెట్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలంతా ఆసక్తిగా మొక్కలు పెంచితేనే ఇది సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం... స్వయంగా అడవుల్ని పెంచుతూ... గ్రీనరీని డెవలప్ చేస్తోంది. ఈ విధానం ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తోంది. తెలంగాణ ఇదివరకటి కంటే చాలా ఎక్కువ పచ్చదనంతో ఇప్పుడు కనిపిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: July 22, 2020, 6:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading