news18
Updated: November 24, 2020, 3:50 PM IST
image credits (Guinness world record)
- News18
- Last Updated:
November 24, 2020, 3:50 PM IST
కూల్ డ్రింక్ బాటిల్ ను సాధారణంగా ఎవరైనా ఓపెనర్ తో ఓపెన్ చేస్తారు. కొంతమంది చేతితో బాటిల్ మూత ఓపెన్ చేయడం చూశాంటారు. పలువురు వేలికి ఉన్న ఉంగరాల ద్వారా బాటిల్ మూతలను తీస్తారు. ఇక మద్యం తాగే సమయంలో పలువురు మందు బాబులు పళ్లతోనే బాటిల్స్ ను ఓపెన్ చేసి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. కానీ ఇక్కడో యువకుడు నొసటి ద్వారా కూల్ డ్రింక్ బాటిల్ మూతలను ఓపెన్ చేస్తున్నాడు. అలా చేసే గిన్నిస్ వరల్డ్ రికార్డు సైతం నెలకొల్పాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. నిమిషంలో ఏకంగా 68 బాటిల్స్ ను నొసటి ద్వారా ఓపెన్ చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇదెక్కడ జరిగింది..? ఇంతకీ ఎవరా వ్యక్తి..?
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన ప్రభాకరరెడ్డి ఈ రేర్ ఫీట్ చేశాడు. అతి తక్కువ సమయంలో నొసటి ద్వారా బాటిల్ మూతలను ఓపెన్ చేశాడు. ఈనెల 18 న ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. ఇందుకు సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రభాకరరెడ్డి చేసిన సాహసానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
వీడియోలో పలువురు వ్యక్తులు ప్రభాకర్ రెడ్డికి బాటిల్స్ అందిస్తుండగా.. అతడు వాటిని ఒక బల్లకు ఉంచి.. నొసటితో వాటి మూతలను తీశాడు. ఇలా ఒక్క నిమిషయంలోనే ఏకంగా... 68 బాటిల్స్ మూతలను తీయడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లు వారి అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈ ఫీట్ ను ఇంట్లో ప్రయత్నించకండి..’ అని రాసుకొచ్చారు. కాగా.. ప్రభాకర్ రెడ్డి 2016 లో పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ రషీద్ రికార్డును బద్దలు కొట్టాడు. 2016 లో రషీద్.. నొసటి ద్వారా 61 బాటిల్స్ క్యాప్స్ తెరిచాడు.ప్రభాకర్ గిన్నిస్ రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. 2018 మేలో 42 మార్షల్ ఆర్ట్స్ త్రో లతో.. ఒక నిమిషంలోనే అత్యధిక మార్షల్ త్రోలు వేసిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఇదిలాఉండగా.. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ప్రభాకర్ చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రభాకర్ ను యువతరానికి ప్రేరణగా కీర్తిస్తున్నారు. అతడు ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 24, 2020, 3:50 PM IST