ఆంధ్రా బ్యాంక్ చరిత్ర ఎంత గొప్పదో.. కానీ నేటి నుంచి కనుమరుగు..

UBIలో ఆంధ్రా బ్యాంక్ విలీనం నేడే

Andhra Bank : ఆంధ్రా బ్యాంక్.. నేటి నుంచి ఈ బ్యాంకు పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక నుంచి అలాగే పిలవాలి.

 • Share this:
  Andhra Bank : ఆంధ్రా బ్యాంక్.. నేటి నుంచి ఈ బ్యాంకు పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక నుంచి అలాగే పిలవాలి. ఎందుకంటే UBIలో ఆంధ్రా బ్యాంక్ అవుతోంది కాబట్టి. దానికి ముహూర్తం కూడా నేడే. తెలుగు వాళ్లతో అనుబంధాన్ని పంచుకున్న ఈ బ్యాంకును స్థాపించింది కూడా తెలుగోడే. 1923 నవంబరు 20న స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారా మయ్య మచిలీపట్నంలో ఈ బ్యాంకును స్థాపించారు. ఈ బ్యాంకు గొప్పదనం ఏంటో తెలుసా.. భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసిన బ్యాంక్ ఇదే. 1980లో జాతీయం చేశారీ బ్యాంకును. అయితే.. దేశంలోనే తొలిసారి క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంక్ ఇదే. 1981లో క్రెడిట్ కార్డులను జారీ చేసింది. తద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసింది.

  ఇక, 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటీఎంలను ఇండియాకు పరిచయం చేసింది ఆంధ్రా బ్యాంక్. అలా ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ బ్యాాంక్ ఇప్పుడు కనుమరుగు కాబోతోంది. నేడే ఈ ప్రక్రియ మొదలుకాబోతోంది. ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్‌ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతోంది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం కానున్న సంగతి తెలిసిందే.

  ఇదిలా ఉండగా, బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియతో 2017లో 27 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12 కు తగ్గిపోతుంది. విలీనంత కస్టమర్లకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఆర్థిక వ్యవస్థకూ మంచిదన్నది కేంద్రం వాదన. బ్యాంకుల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని చెబుతూ వస్తోంది.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: