చరిత్రకు ఆనవాల్లు...ఈ పురాతన విగ్రహాలు

చరిత్రకు ఆనవాల్లు... ఈ పురాతన విగ్రహాలు ..

రైతు తన పొలంలో ట్రాక్టర్ ద్వారా దున్నుతున సందర్భంలో బయటపడ్డ జైన, బౌద్ధ విగ్రహాలు ...

  • Share this:
    కరీంనగర్ జిల్లా :  జైనుల వారసత్వంగా భావిస్తున్న ఈ ప్రాంతాన్ని వారసత్వ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
    కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నర్సింహాలపల్లి రైతు తన పొలంలో ట్రాక్టర్ ద్వారా దున్నుతున సందర్భంలో జైన విగ్రహం లభ్యమైంది. ఈ శిల్పములను పరిశీలించిన వీటిలో ఒక్కటి పార్శనాథుడు (ఏడూ పడగల కలది) రెండవది మహావీరుడు గుర్తించడం జరిగింది వీటిని క్రీ.శ 8-9 వ శతాబ్దంనికి కాలానికి చెందినవి అని అన్నారు . ఈ ప్రాంతంలో పరిశీలించగా చారిత్రక తవ్వకాలు చేపడితే మరికొన్ని శిల్పాలు లభ్యం అవుతాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రాష్ట్రకుటులు, వేములవాడ చాలిక్యులు, కళ్యాణి చాలిక్యులు,కాకతీయుల కాలానికి చెందిన ఆధారాల ఉంటాయని అధికారులు తెలిపారు. త్వరలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ రానున్నారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. బొమ్మలమ గుట్ట ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని గత అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపి కోట్ల నర్సింహుల పల్లి గ్రామాన్ని సందర్శన క్షేత్రంగా ఏర్పాటు చేయాలి. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి,ఎంపీపీ శ్రీరాం మధుకర్, ఎస్సై వివేక్,సర్పంచ్ తోట కవిత మల్లారెడ్డి, ఎంపీటీసీ దుబ్బాసి బుచ్చమ్మ బుచ్చయ్య,గంగాధర సంపత్ తదితరులు పాల్గొన్నారు.
    Published by:Venu Gopal
    First published: