హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ప్రాక్టీస్‌లో చెమటలు కక్కిన బుల్లితెర తార..ఇన్ని కష్టాలు అందుకోసమేనా..?

ప్రాక్టీస్‌లో చెమటలు కక్కిన బుల్లితెర తార..ఇన్ని కష్టాలు అందుకోసమేనా..?

Photo Credit: Instagram

Photo Credit: Instagram

Vishnupriya: టీవీ యాంకర్‌ విష్ణుప్రియ..ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తోంది. తన కంటే ముందు యాంకర్‌లుగా పాపులర్ అయిన ఇద్దరు ఫిల్మ్ఇండస్ట్రీలో దూసుకుపోతుండటంతో తాను ఆదే రూట్‌లో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె చేసిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాలో రచ్చ రచ్చ చేస్తోంది.

ఇంకా చదవండి ...

హీరోయిన్‌ల దగ్గర నుంచి టీవీ యాంకర్‌ల వరకూ టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ సమంతను ఫాలో అవుతున్నారు. యాక్టింగ్‌, డ్యాన్స్‌ ఏదైనా సమంత (Samantha)ఇరగదీసినట్లుగా ఎవరి వల్లా కాదనే టాక్‌ పుష్ప (Pushpa)సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌(Item song)తో ప్రూవ్ అయింది. ఊ అంటావా మావా ఉ ఉ అంటావా మావా అనే పాటలో సమంత వేసిన స్టెప్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ని యాజ్‌ టీజ్‌గా దించేయాలని సౌత్‌(South), నార్త్‌(North)తో పాటు ఇతర భాషల్లోని నటులతో పాటు విదేశీ యాక్టర్లతో పాటు సెలబ్రిటీలు ఇలా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ల లిస్ట్‌లో చేరిపోయింది బుల్లితెర తార విష్ణుప్రియ(Vishnupriya). స్మాల్‌ స్క్రీన్‌పై కామెడీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించే విష్ణుప్రియ..ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో రచ్చ రచ్చ చేస్తోంది. యాంకర్‌(Anchor)గా ఉంటూ సినిమాల్లో బిజీ అయిన మరో యాంకర్‌ అనసూయను స్పూర్తిగా తీసుకుందో తెలియదో కాని..ఇన్‌స్టా (Instagram)లో ఫాలోవర్స్‌ తనను కంటిన్యూగా ఫాలో అయ్యేలా చేయాలనుకుంటోంది. అందులో భాగంగానే పుష్పలోని సమంత సాంగ్‌కి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసిన విష్ణుప్రియ (Vishnupriya)..చమటలు కక్కేలా ప్రాస్టీస్ చేసింది. ఈ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో కుర్రాళ్లు పదే పదే ఆ వీడియోని చూస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయింది.

వాళ్లకంటే నేనేం తక్కువ కాదు..

డ్యాన్స్‌లో పెద్ద ప్రావిణ్యం లేదో లేక డ్యాన్స్‌ బాగా నేర్చుకొని ఐటమ్‌ గర్ల్‌గా ఇండస్ట్రీలో పాతుకుపోవాలనుకుంటో తెలియదు గానీ విష్ణుప్రియ ఊ అంటా సాంగ్‌కి డ్యాన్స్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఇరగదీసే మూమ్‌మెంట్స్‌ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్‌ ప్లే చేస్తూ..అదే చరణాలకు అనుగూణంగా స్టెప్పేలింది ఈ స్మాల్‌ స్క్రీన్‌ యాంకర్.


స్మాల్‌ స్క్రీన్‌ కాదు సిల్వర్‌ స్క్రీన్‌పైనే గురి..

ఇప్పటికే టీవీ యాంకర్‌లుగా కొనసాగుతూ టాలీవుడ్‌లో హీరోయిన్‌లు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లుగా బిజీ అయ్యారు అనసూయ, రష్మి. శ్రీముఖి. వాళ్ల బాటలోనే తాను కూడా సిల్వర్‌ స్క్రీన్‌ని షేక్ చేయాలని ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తోంది విష్ణుప్రియ వాలకం చూస్తుంటే. అందుకే ఈమధ్యనే ఇన్‌స్టా అకౌంట్‌ ఓపెన్‌ చేసిన యాంకర్..అంతకు మించి అనే రేంజ్‌లో డ్యాన్స్‌ వీడియోలను షేర్ చేస్తోంది. విష్ణుప్రియ వర్కవుట్స్‌ ఏమేరకు ఫలితాలిస్తాయో చూడాలి. ఐటమ్‌ సాంగ్స్ కాకపోయినా..కనీసం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ , పెద్ద హీరోల సినిమాల్లో  మెయిన్‌ క్యారెక్టర్ అవకాశాలైనా వస్తాయో లేదో చూడాలి.

First published:

Tags: Anchor vishnu priya, Anchor vishnupriya hot yoga

ఉత్తమ కథలు