Home /News /trending /

ANCHOR OMKAR FIRES ON MUMAITH KHAN IN DANCEE PLUS SHOW NR

Dancee plus: నన్ను అంటారేంటి అంటూ 'ముమైత్ ఖాన్'పై ఫైర్ అయ్యిన ఓంకార్!

mumaith khan

mumaith khan

Dancee plus: బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారం అవుతున్న షో డ్యాన్స్ ప్లస్. ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి శని, ఆదివారాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది.

    Dancee plus: బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారం అవుతున్న షో డ్యాన్స్ ప్లస్. ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి శని, ఆదివారాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. డ్యాన్స్ షో పేరుతో భారీగా మ్యాజిక్ చేస్తూ.. అప్పుడప్పుడు లేడీ జెడ్జిలను స్టేజిపై తీసుకొచ్చి వాళ్ళతో డ్యాన్స్ చేపిస్తూ షో ను హైలెట్ చేస్తున్నారు.

    అయితే సాధారణంగానే ఓంకార్ అన్నయ్య ఉన్నారు అంటే ఆ షో లో జడ్జిమెంట్ హడావుడి మాములుగా ఉండదు. నిజానికి బుల్లితెర షోస్ అంటేనే జడ్జిమెంట్ హడావుడి అదే ఓంకార్ అన్నయ్య షో అంటే మరింత ఎక్కువ. ఎందుకంటే రేటింగ్స్ విషయంలో ఎంతో కష్టపడే యాంకర్ ఓంకార్. అందుకే గత 15 ఏళ్లలో ఎన్నో షోస్ చేసిన ఓంకార్ అన్నింటిలోనూ ఇలాంటి జడ్జిమెంట్ కాంట్రవర్సీలు ఉన్నాయ్.

    ఇక ఈ డ్యాన్స్ ప్లస్ షో కు ముమైత్ ఖాన్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈరోజు ప్రసారం కానున్న డ్యాన్స్ ప్లస్ షో కు సంబంధించి ప్రోమో విడుదల చెయ్యగా ఆ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో కంటెస్టెంట్‌కి ముమైత్ ఖాన్ కు గొడవ జరగగా ఆ గొడవలో ముమైత్ ఖాన్ గట్టిగట్టిగా అరవగా.. ఎందుకు సీరియస్ అవుతున్నారూ అంటూ ఓంకార్ ప్రశ్నించగా.. ఆమె నేను ఇక్కడ జడ్జిని అతను నన్ను పాయింటౌట్ చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతుంది.



    సరే కూల్ అవ్వండి అంటూ ఓంకార్ చెప్పిన వినకుండా అప్పటికి ముమైత్ ఖాన్ తన కోపాన్ని తగ్గించకపోవడంతో ఓంకార్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తప్పు ఏదైన చేస్తే నన్ను పాయింట్ అవుట్ చెయ్యండి.. మీరు ఇద్దరు కొట్టుకుని నన్ను పాయింట్ అవుట్ చేస్తారు ఏంటి అంటూ ముమైత్ ఖాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ కాంట్రవర్సీ ఫుల్ స్టోరీ ఏంటో ఈరోజు తెలుస్తుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anchor omkar, Anne master, Dancee Plus, Monal gajjar, Mumaith Khan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు