Home /News /trending /

ANANYAPANDE AND ISHANKHATTAR ARE MEMBERS OF TWO FAMILIES WHO REJECTED THE LOVE AFFAIR SNR

విరహవేదనలో బాలీవుడ్‌ ప్రేమజంట..లైగర్ బ్యూటీ లవ్‌ స్టోరీలో వాళ్లే విలన్స్..?

Photo Credit: Instagram

Photo Credit: Instagram

Love Tragedy: బాలీవుడ్‌లో మరో యువప్రేమ జంట విరహవేదనలో ఉంది. లైగర్ బ్యూటీ అనన్యపాండే, ఇషాన్‌ఖట్టర్ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించుకుందామనుకుంటే ప్రేమకథ అడ్డం తిరిగింది.

వాళ్లిద్దరికి ఎంత కష్టం వచ్చింది. ప్రేమ పావురాల్లా గాల్లో ఎగిరిపోదామనుకున్నారు. కానీ ఈ పెద్దొళ్లున్నారే వాళ్ల ప్రేమను అర్ధం చేసుకోవడం లేదు. మీకు ఇంకా ఆ వయసు రాలేదు. ముందు కెరియర్‌పై దృష్టి పెట్టండి అంటూ ఆ ప్రేమికుల కోరికలపై ఆంక్షలు పెట్టి అడ్డుపడ్డారు. ఈపరిస్థితి నుంచి బయటపడేందుకు వేరే దారి లేక ఆ రెండు ప్రేమ పక్షులు వేర్వేరుగా తిరుగుతూ సోషల్ మీడియా(Social media)లో చాటింగ్‌తో సరిపెట్టుకుంటున్నాయి. లైగర్ మూవీ(Liger movie)లో లీడ్‌ రోల్ చేస్తున్న అనన్యా పాండే (Ananya Panday)కొద్దిరోజులుగా ఇషాన్‌ఖట్టర్(Ishaan Khatter) అనే యంగ్‌ స్టార్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌..సమ్‌థింగ్‌ నడుస్తోందని బాలీవుడ్ (Bollywood)అంతా కోడై కూసింది. ఇండస్ట్రీలో పుట్టినవి పుకార్లు కాదని ఇద్దరూ పలుమార్లు మీడియా కంట పడటంతో అందరికి నిజమేనని తేలిపోయింది. దీంతో ఈ కొత్త సంవత్సరంలో అనన్యాపాండే, ఇషాన్‌ఖట్టర్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఒక్కటవ్వాలనుకున్నారు.

లైగర్ భామకు ప్రేమ కష్టాలు..
సీన్ కట్ చేస్తే ఈ ప్రేమజంట కోరిక నెరవేరలేదు కదా..అటు ఇషాన్‌ఖట్టర్, అనన్యపాండే కుటుంబ సభ్యులు వీరిద్దరి ప్రేమపెళ్లికి పచ్చజెండా ఊపలేదు. మీరు ఇప్పుడే పెళ్లి చేసుకునే వయసు కాదని..దానికి ఇంకా చాలా టైముందని సర్ది చెప్పారు. ఇక ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడంతో ముందు కెరియర్‌పై ఫోకస్ పెట్టమని సలహా ఇచ్చి ఇద్దరి మధ్య పీక్స్‌కు వెళ్లిన ప్రేమాయణాన్ని సింపుల్‌గా కట్ చేశారు. దాదాపు రెండు ఫ్యామిలీలు తమ ప్రేమను అంగీకరిస్తాయని భావించి సీరియస్‌గా ప్రేమలో మునిగిపోయారు అనన్యపాండే, ఇషాన్‌ఖట్టర్. ఈ యువజోడి పెళ్లి వరకూ కాదు కదా..కనీసం ప్రేమించుకోవడానికి ఉన్న దారి మూసుకుపోవడంతో విరహ వేదనలో ఉన్నారు. అనన్య పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే వీళ్లిద్దరి మధ్య ప్రేమ  ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతుంది.

విడిపోయిన ప్రేమజంట..
అనన్యపాండే, ఇషాన్‌ఖట్టర్ ప్రేమలో పడక ముందు రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్‌షిప్ ఉండేది. ఒకరి ఇంటికి మరొకరు వచ్చిపోతూ ఉండే క్రమంలోనే  అనన్యపాండే, ఇషాన్‌ఖట్టర్ మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా చిగురించింది. దీనికి తోడు ఇద్దరు కలిసి రాజస్థాన్‌ అడవికి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరడం వంటి వీడియోలు సోషల్ మీడియా ద్వారా పెద్దల దృష్టికి రావడంతో అనన్యపాండే , ఇషాన్‌ ఖట్టర్‌ లవ్‌స్టోరీకి పెద్దలు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగానే ఇద్దర్ని వయసు, కెరియర్‌ పేరుతో విడగొట్టినట్లుగా బాలీవుడ్‌లో రూమర్‌ నడుస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Ananya pandey, Liger, Love failure

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు