Anand Mahindra: ఈ వీడియో చూస్తే ఎక్సర్‌సైజ్ చేసిననట్లే.. బద్ధకస్తులకు ఆనంద్ మహింద్రా చిట్కా

ఆనంద్ మహింద్రా(ఫైల్ ఫొటో)

ఆనంద్ మహింద్రా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వీక్షించారు. దాదాపు 1300 మంది రీట్వీట్ చేశారు. మీరు చెప్పిన మాటలతో ఏకీభవిస్తామని.. జిమ్నాస్ట్‌ల ఫీట్లు మాములుగా లేవని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

 • Share this:
  వారంలో ఆరు రోజులు అందరిదీ ఉరుకులు పరుగుల జీవితం. ఆదివారం మాత్రమే ఎవరికైనా కాస్త తీరిక దొరుకుతుంది. ఆ రోజు చాలా మంది ఇంట్లోనే ఉండి రిలాక్స్ అవుతారు. అంతేకాదు బద్ధకంగా కూడా ఉంటారు. ఐతే ఆరు రోజుల పాటు ఎక్సర్‌సైజ్‌లు చేసేవారు కూడా సండే రోజు లేజీగా కనిపిస్తారు. వ్యాయామం చేసేందుకు వెనకాడతారు. అలాంటి వారి కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఓ చిట్కా చెప్పారు. బద్ధకస్తుల కోసం ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తే చాలు.. ఎక్సర్‌సైజ్ చేయాల్సిన పనిలేదంటే ఆయన చమత్కరించారు. అందులో జిమ్మాస్ట్‌లు చేసే విన్యాసాలు అంత అద్భుతంగా ఉన్నాయి. మనమే చేసిన ఫీలింగ్ కలుగుతుందన్నది ఆనంద్ మహింద్రా అభిప్రాయం.


  ''మీరు రోజూ వ్యాయామం చేస్తూ ఆదివారం వచ్చే సరికి బద్ధకంగా ఫీలయ్యే రకానికి చెందిన వారా? అయితే ఒక అద్భుతమైన ఒక పరిష్కారం ఉంది. నాలాగే మీరు ఈ వీడియోను సేవ్‌ చేసి పెట్టుకోండి. కనీసం రెండుసార్లు చూడండి. చివరకు మీ శరీరంలోని ప్రతి కండరమూ వ్యాయామం చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది.'' అని ట్విటర్‌లో పేర్కొన్నారు ఆనంద్ మహింద్రా. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  ఆనంద్ మహింద్రా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వీక్షించారు. దాదాపు 1300 మంది రీట్వీట్ చేశారు. మీరు చెప్పిన మాటలతో ఏకీభవిస్తామని.. జిమ్నాస్ట్‌ల ఫీట్లు మాములుగా లేవని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి అద్భుతాలు చేసే వారు మనదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారని మరికొందరు ట్వీట్స్ చేశారు. అలాంటి వారిని వెలుగులోకి తేకపోవడం వల్లే మన దేశం ఒలింపిక్స్ క్రీడల్లో రాణించలేకపోతోందని పలువురు కామెంట్లు చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: