Anand Mahindra: ఆనంద్‌ మహీంద్రా కంటపడ్డ అద్భుతమైన ప్రాంతం... ఇప్పుడు అందరి చూపు దాని మీదే!

Photo Credit : Twitter

Anand Mahindra: స్విమ్మింగ్‌ పూల్‌ అంటే... ఏదో ఒక ఖాళీ ప్రదేశంలో తవ్వి ఏర్పాటు చేస్తారు. బాగా డబ్బున్నవాళ్లు అయితే... వాళ్ల భవనంపై పై ఫ్లోర్‌లో విశాలంగా ఏర్పాటు చేస్తారు. అయితే అదే పూల్‌ కొండల అంచున, ప్రకృతి మధ్యలో ఉంటే.. అదికూడా సహజసిద్ధంగా ఏర్పడితే.. సూపర్‌ కదా.

  • Share this:
ట్విటర్‌లో విచిత్రమైనవి,ఆసక్తికరమైనవి గుర్తించడంలో ముందుంటారు ఆనంద్‌ మహీంద్ర (Anand Mahindra). ఇంట్రస్టింగ్‌ అంశం కనిపించగానే రీట్వీట్‌ చేస్తూ.. దాన్ని నెటిజన్ల దృష్టికి తీసుకొస్తారు. విచిత్రాలు చూడాలంటే.. ఆయన ట్విటర్‌ ఓపెన్‌ చేసేస్తుంటారు నేటి యువత. తాజాగా ఆయన ఓ స్విమ్మింగ్‌ పూల్‌ ఫొటో ఒకటి ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఇప్పుడు యువత ఆ పూల్‌ గురించి తెగ వెతికేస్తున్నారు. అన్నట్లు ఆయన కూడా అదే పనిలో ఉన్నారట. ఎక్కడుందో కనుక్కొని... వెళ్లి అందులో జలాకాలాడాలని మనసు ఉవ్విళ్లూరుతోందట. స్విమ్మింగ్‌ పూల్‌ అంటే... ఏదో ఒక ఖాళీ ప్రదేశంలో తవ్వి ఏర్పాటు చేస్తారు. బాగా డబ్బున్నవాళ్లు అయితే... వాళ్ల భవనంపై పై ఫ్లోర్‌లో విశాలంగా ఏర్పాటు చేస్తారు. అయితే అదే పూల్‌ కొండల అంచున, ప్రకృతి మధ్యలో ఉంటే.. అదికూడా సహజసిద్ధంగా ఏర్పడితే.. సూపర్‌ కదా. అలాంటి ఫొటోనే ఆయన షేర్‌ చేశారు. దానికి ఇన్ఫినిటీ పూల్‌ అని పేరు కూడా పెట్టారు. ఇది హిమాలయాల్లో ఉందని సమాచారం. ఈఫొటోను తొలుత సిద్ధార్థ బకారియా అనే వ్యక్తి గత నెల ట్వీట్‌ చేశారు. అయితే ఇప్పుడు ఆనంద్‌ మహీంద్రా దానిని ట్వీట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ చేస్తూ... ఆ ప్రాంతం తన బకెట్‌ లిస్ట్‌లో చేరిపోయిందని, ఎక్కడుందో జీపీఎస్‌ లొకేషన్‌ వివరాలు పంపిస్తే వెళ్తాను అంటూ రాసుకొచ్చారు. ఆయన ట్వీట్‌కు చాలామంది నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. కొంతమందైతే... మీకు ఆ పూల్‌ లొకేషన్‌ వివరాలు తెలిస్తే... ఎవరికీ చెప్పకండి. ఆ ప్రాంతం అందం మొత్తం పాడైపోతుంది అని ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఆ ఫొటోను తొలుత షేర్‌ చేసిన సిద్ధార్థ ఆ ప్రాంత వివరాలు తెలియజేశాడు. ఆ పూల్‌ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ ప్రాంతంలోని ధార్‌చులా దగ్గర ఉంది. అంతే కాదు ఆ ఫొటోను దామి నరేశ్‌ అనే వ్యక్తి తీశారని, గతేడాది డిసెంబరులో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడని కూడా చెప్పుకొచ్చారు.








ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ కింద చూస్తే... ఇంకొన్ని ఇలాంటి ఆసక్తికరమైన పూల్‌, జలపాతాల ఫొటోలు కనిపించాయి. సర్‌.. మీరు ఈ ప్రాంతాలను వెళ్లాలంటే ట్రై చేయొచ్చు అంటూ రాసుకొచ్చారు నెటిజన్లు. మరికొందరు అయితే ఆ ఫొటోను డీప్‌గా పరిశీలించి... చాలా రిస్క్‌ ప్లేస్‌ అని చెబుతున్నారు. రాళ్లతో నిర్మితమైన పూల్‌ కాబట్టి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
Published by:Sridhar Reddy
First published: