హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Anand Mahindra: ఆ కుక్క పొందిన ఆనందమే నాకు కావాలి.. ఆనంద్ మహీంద్రా వింత కోరిక..

Anand Mahindra: ఆ కుక్క పొందిన ఆనందమే నాకు కావాలి.. ఆనంద్ మహీంద్రా వింత కోరిక..

ఆనంద్ మహింద్ర

ఆనంద్ మహింద్ర

ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోకు నెటిజ‌న్ల నుంచి కామెంట్స్ వ‌ర్షం కురుస్తోంది. ఐదు ల‌క్ష‌ల వ్యూస్ దాటేసిన ఈ వీడియో గురించి నెటిజ‌న్లు స్పందిస్తూ, `మీరే కాదు మేము కూడా ఈ శున‌కం పొందిన ఆనందాన్నే పొందాల‌నే ఆత్రుత‌తో ఉన్నామంటూ` కామెంట్లు షేర్ చేసుకుంటున్నారు

ఇంకా చదవండి ...

క‌రోనా దెబ్బతో వ్యాపారాల‌న్ని కుదేల‌య్యాయి. స్వేచ్ఛ‌గా తిర‌గాల‌నుకునే చాలా మంది ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. స‌రిగ్గా ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కుంటున్నారు వ్యాపార దిగ్గ‌జాలు కూడా. అందులో స‌మాజానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ఆనంద్ మహీంద్ర కూడా ఒకరు. ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన మనసులోని భావాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ కుక్క వీడియో పోస్ట్ చేస్తూ కరోనా వల్ల ఇంట్లోనే బందీనై పోయాను. ఇంటి నుంచి స్వేచ్ఛగా బయటకు వెళ్లే అవకాశం లభిస్తే ఈ కుక్కలా వ్యవహరిస్తాను అంటూ ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోకు నెటిజ‌న్ల నుంచి కామెంట్స్ వ‌ర్షం కురుస్తోంది. ఐదు ల‌క్ష‌ల వ్యూస్ దాటేసిన ఈ వీడియో గురించి నెటిజ‌న్లు స్పందిస్తూ, `మీరే కాదు మేము కూడా ఈ శున‌కం పొందిన ఆనందాన్నే పొందాల‌నే ఆత్రుత‌తో ఉన్నామంటూ` కామెంట్లు షేర్ చేసుకుంటున్నారు.

మంహీంద్రా సంస్థ‌ల చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర ఈ వైర‌ల్‌ వీడియో పోస్ట్ చేసే స‌మ‌యానికి భార‌త‌దేశంలోని వివిధ రాష్ట్రాలు క‌రోనాకు క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లుచేస్తున్నాయి. పూర్తి లాక్‌డౌన్ కాక‌పోయిన‌ప్ప‌టికీ క‌ర్ఫ్యూలాంటి వాతావ‌ర‌ణమే చోటుచేసుకుంది. ముఖ్యంగా రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీ, ఆర్థిక న‌గ‌రం ముంబై లాంటి ప్రాంతాల్లో కోవిడ్‌-19 ని నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు తీవ్ర‌స్థాయికి చేరుకున్నాయి.

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ ఈ వారంతం నుంచి ప్రతి వీకెండ్ ఢిల్లీ న‌గ‌రం క‌ర్ఫ్యూ కింద‌కు వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం రాత్రి 10 గం. నుంచి సోమ‌వారం ఉద‌యం 5 గం. వ‌ర‌కూ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ఆదేశించారు. ఈ స‌మయంలో ఒక్క నిత్య‌వ‌స‌ర స‌రుకులు, ముఖ్య‌మైన అవ‌స‌రాల‌కు సంబంధించిన సేవ‌లు త‌ప్ప దాదాపుగా అన్నీ నిషేధించారు. లిక్క‌ర్ షాపుల‌తో స‌హా నిత్య‌వ‌స‌రాలు కానీ షాప్‌లన్నింటినీ మూసేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో పాటు ఢిల్లీలో ఏప్రిల్ 30 తేదీ వ‌ర‌కూ అన్ని రోజులూ మాల్స్‌, బార్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు. స్పాలు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, ఆడిటోరియ‌మ్స్ అన్నీ మూత‌ప‌డుతున్నాయి. ఇక కోవిడ్‌-19 విల‌య‌తాండ‌వం చేస్తున్న మ‌హారాష్ట్ర‌లో అయితే మే 1 తేదీ వ‌ర‌కూ 144 సెక్ష‌న్ విధించారు. ఏ ఒక్క‌రు స‌రైన కార‌ణం లేకుండా బ‌య‌ట క‌నిపించ‌కూడ‌ద‌నే నిబంధ‌న గ‌ట్టిగా అమ‌లుచేస్తున్నారు.

ఇక ఇంత‌కుముందే సివిల్ ఏవియేష‌న్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఏప్రిల్ 30, 2021 వ‌ర‌కూ ఇండియాకు, ఇండియా నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ పాసింజ‌ర్ స‌ర్వీసుల షెడ్యుల్‌పై నిషేధం విధించారు. అంతేకాదు, చాలా రాష్ట్రాలు ఇప్పుడు త‌మ రాష్ట్రానికి రావాలంటే విమాన ప్ర‌యాణికుల‌ను నెగెటివ్ ఆర్‌టి-పిసిఆర్ టెస్ట్ రిపోర్టును చూపించ‌మ‌ని అడుగుతున్నారు. దేశ‌వ్యాప్తంగా మ‌రోసారి ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌టంతో ఆనంద్ మ‌హీంద్ర పోస్ట్ చేసిన ఈ వీడియో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది.

ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోలో షెల్ట‌ర్ నుంచి విడుదల అయిన ఒక కుక్క ముందుగా త‌న ప‌రిస‌రాల‌ను గ‌మ‌నిస్తుంది. స్వేచ్ఛ‌గా తిర‌గ‌గ‌లిగిన వాతావ‌ర‌ణాన్ని గ‌మ‌నించిన దానికి ఎంతో ఉత్సాహం వచ్చింది. దీంతో అది ఆనందంతో ఎగిరెగిరి గంతులు వేస్తుంది.తాను కూడా ఈ కోవిడ్ వ్యాప్తి తగ్గి, నిబంధనలు తీసేసిన తర్వాత ఈ శున‌కంలా గంతులు వేస్తాన‌ని ఆనంద్ మ‌హీంద్ర ఈ పోస్టులో రాశారు. ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో గెంతుతున్న ఈ కుక్క నాలాగే ఫీలవుతోందని ఆయన ఆనందం వ్య‌క్తం చేశారు.


భారత్‌లో కొత్తగా 2,34,692 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. కొత్తగా 1,341 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220కి చేరింది. రికవరీ రేటు 87.2 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Anand mahindra, Coronavirus, Lock down, Viral Video

ఉత్తమ కథలు