HOME »NEWS »TRENDING »anand mahindra shares video of men playing jingle bells on sitar shehnai goes viral srd

Anand Mahindra : క్రిస్మస్ పండుగ వేళ మరో అద్భుత వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra : క్రిస్మస్ పండుగ వేళ మరో అద్భుత వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra (File Photo )

Anand Mahindra : ప్రముఖ పారిశామ్రిక వేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‏గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన దృష్టికి వచ్చిన అద్భుత విషయాలు, వీడియోలను నెటిజన్లతో షేర్‌ చేస్తారు. ఈ సారి కూడా ఆయన మరో అద్భుతమైన వీడియోతో ముందుకొచ్చారు.

  • Share this:
    ప్రముఖ పారిశామ్రిక వేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‏గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన దృష్టికి వచ్చిన అద్భుత విషయాలు, వీడియోలను నెటిజన్లతో షేర్‌ చేస్తారు. ఈ సారి కూడా ఆయన మరో అద్భుతమైన వీడియోతో ముందుకొచ్చారు. క్రిస్మస్ పండుగ వేళ ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇంతకీ ఏముందనుకుంటున్నారా. కొందరు వివిధ సంగీత వాయిద్యాలతో జింగిల్ బెల్ సాంగ్ వాయించారు. వారు ఉపయోగించిన సంగీత వాయిద్యాల్లో భారత్ కు చెందిన సారంగి, షెనహాయ్, సితార లాంటివి ఉన్నాయ్. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన 2 నిమిషాల 20 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది. " క్రిస్మస్ పండుగకు  మంచి వార్నప్. కొంచెం గందరగోళంగా ఉన్నా.. అద్భుతమైన మ్యూజిక్ విన్నాను " అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.


    ఈ వీడియోలో కొంత మంది యువకులు జింగిల్ బేల్ పాటను వాయిస్తూ క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారి వాయిస్తున్న వాయిద్యాల్లో ఇండియాకు చెందిన సితార్, సారంగి, షెనహాయ్ లాంటివి ఉన్నాయ్. ఈ వీడియోలో డోల్ ను కూడా ఉపయోగించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.








    ప్రతి సంబరానికి మ్యూజిక్ ఆత్మ లాంటిది అని ఒకరు కామెంట్ చేస్తే, ఈ ఏడాదికి ఇదే బెస్ట్ మ్యూజిక్ అంటూ మరోకరు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ ఏడాది ఆఖర్లో అద్భుతమైన మ్యూజిక్ అంటూ మరొకరు ఈ వీడియోపై కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 50 వేల కన్నా ఎక్కువ సార్లు చూశారు.
    Published by:Sridhar Reddy
    First published:December 25, 2020, 21:42 IST

    टॉप स्टोरीज