హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: 40లక్షలకే లగ్జరీ హౌస్.. ఒకచోటి నుంచి మరొక ప్రదేశానికి మార్చుకోవచ్చు..వీడియో ఇదిగో..

Viral video: 40లక్షలకే లగ్జరీ హౌస్.. ఒకచోటి నుంచి మరొక ప్రదేశానికి మార్చుకోవచ్చు..వీడియో ఇదిగో..

foldable house

foldable house

Viral video: 40లక్షలకే అద్భుతమైన సౌకర్యాలతో డిజైన్డ్ ఫోల్డబుల్ హౌస్‌ వీడియోని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అందరికి షేర్ చేశారు.ఇప్పుడు ఈ వీడియో చూసి ..ఇలాంటి ఇళ్లు ఎవరు నిర్మిస్తున్నారు..? అవి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి ..? ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కొద్ది స్థలంలో సౌకర్యవంతమైన ఇంటిని తక్కువ ఖర్చుతో నిర్మించడం చాలా కష్టం. విలాసవంతమైన ఇంటిని సరసమైన ధరకే నిర్మించి ఇవ్వడం కాదు..ఆ ఇంటిని ఒక చోటి నుంచి మరొక చోటికి తీసుకెళ్లే విధంగా తయారు చేసారు. ఇంత క్రియేటివిటీతో లగ్జరీ హౌస్‌(Luxury House)ఎక్కడ దొరుకుంతో అందరికి తెలియజెప్పారు బిజినెస్‌మెన్ ఆనంద్‌ మహీంద్ర(Anand mahindra). సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర రీసెంట్‌గా 40లక్షలకే అద్భుతమైన సౌకర్యాలతో డిజైన్డ్ ఫోల్డబుల్ హౌస్‌ (Foldable house)వీడియోని తన ట్విట్టర్‌ (Twitter)ఖాతా ద్వారా అందరికి షేర్ చేశారు.ఇప్పుడు ఈ వీడియో(Video)చూసి ..ఇలాంటి ఇళ్లు ఎవరు నిర్మిస్తున్నారు..? అవి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి ..? ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేస్తున్నారు.

Viral video: ముంగీసలే అతనికి స్నేహితులు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

ఫోల్డబుల్ హౌస్ ..

బుర్రలో తట్టే కొత్త కొత్త ఐడియాలు, అందివస్తున్న టెక్నాలజీ ఆధారంగా ఎన్నో వింతలు, విచిత్రమైన నిర్మాణాలు చూస్తున్నాం. తాజాగా మహీంద్ర గ్రూప్స్‌ చైర్మెన్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అదేంటంటే ఫోల్డబుల్ హౌస్(మడతపెట్టగల ఇల్లు). అంటే ఒక చోటి నుంచి మరొక చోటికి ఒక బాక్సు మాదిరిగా ఇంటిని ప్యాక్ చేసి పట్టుకెళ్లే విధంగా తయారు చేశారు. కేవలం 40లక్షల ఖరీదుతో 500చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు డిజైన్ చేశారు. ఒక బెడ్రూం, హాలు, కిచెన్‌తో పాటు బాత్రూం,వాష్‌రూం అన్నింటిని ఇందులో సెట్ చేశారు. లాస్‌వేగస్‌లోని బాక్సైల్ అనే ఓ సంస్థ ఈ తరహా ఫోల్డబుల్ హౌస్‌ని తయారు చేస్తోంది.

ఎక్కడికైనా మార్చుకోవచ్చు..

ఈ మడత పెట్టి తీసుకెళ్లే ఇంటి వీడియోని చూసి ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఇండియాలో ఇలాంటి ఇళ్లు ఇంకా తక్కువ ధరకే తయారు చేయవచ్చని చెప్పారు. అంతేకాదు విపత్తులు సంభవించిన తర్వాత పునరావాస కేంద్రాల తరహాలోనే ఇలాంటి వాటిని నిర్మిస్తే ఇలాంటి ఇళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని అందరికి యోగ్యంగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

40లక్షలకే ..లగ్జరీ హౌస్

ప్రస్తుతం ఇలాంటి ఇళ్లు కేవలం అమెరికా వంటి అగ్రదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫోల్డబుల్ హౌస్‌ నిర్మాణం, వివరాల కోసం మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.boxabl.com/పోర్టల్‌లో ఓపెన్ చేసి చూస్తే అర్ధమవుతుంది. వీటి నిర్మాణం కోసం ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నారో కూడా అర్ధమవుతుంది.

First published:

Tags: Anand mahindra, Trending news, Viral Video

ఉత్తమ కథలు