Anand Mahindra Motivation Post : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కొద్ది మంది ప్రముఖుల్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలెంట్ ఎక్కడ కనిపించినా ప్రోత్సహిస్తుంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు,పెట్టే వీడియోలు చాలా జీవితాల్లో వెలుగులను కూడా తీసుకొచ్చాయి. ఆయన పోస్ట్ లు ఎప్పుడూ ఆశక్తికరమైనవిగా,సందేశాత్మకంగా,సమాజాన్ని ఆలోచింపజేసేవిగా ఉంటుంటాయి. అయితే తాజాగా ఈ 66 ఏళ్ల పారిశ్రామిక వేత్త ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక వీడియోతెగ వైరల్ అవుతోంది. తన మండే మోటివేషన్ (Monday Motivation)పోస్టుల్లో భాగంగా ఆయన సోవామరం ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా విలువ కట్టలేని ఓ సందేశాన్ని ఆయన ఇచ్చారు. "ఒక్కోసారి సోమమారం ఉదయం ప్రమాదకరంగా అనిపించవచ్చు. కానీ మీరు వారమంతా గడిచేలా చెయ్యగలగాలి. ప్రమాదంలో పడి లోయలోకి జారిపోకూడదు" అనే క్యాప్షన్ త తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఆ వీడియోలో..ఉత్తరాఖండ్‌లోని జోహార్ లోయ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశంలో సన్నటి ఘాట్ రోడ్డుపై ఓ ట్రక్ లాంటి వాహనం వెళ్తోంది. అందులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా మిలామ్ నుంచి జోహార్ లోయకు వెళ్తున్నారు. ఆ రోడ్డు అంతా గుంతలు,గతుకులు. ఏమాత్రం తేడా వచ్చినా వాహనంతో సహా వారంతా లోయలో పడిపోయే పరిస్థితి. అయినా సరే వారుతమ ప్రయాణం అలాగే సాగించారు. ఈ వీడియోని 2020లో ఫేస్ బుక్ లో శుభయాత్ర పేరుతో ఉన్న అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీనిని ఇప్పుడు ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో మళ్లీ పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Sometimes, a Monday morning can feel as precarious as this…But you always make it through the week without falling off the cliff…Hang in there. #MondayMotivation pic.twitter.com/gnwzJ621Wk
— anand mahindra (@anandmahindra) April 11, 2022
ALSO READ Setback for Sasikala : చిన్నమ్మకు బిగ్ షాక్..సంతోషంలో పన్నీర్,పళని
ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది థ్రిల్ కలిగిస్తోందని అంటుంటే... మరికొందరు ఇలా వెళ్లకూడదు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఫొటోషాప్ లా ఉంది... నిజంలా కనిపించట్లేదని మరో యూజర్ కామెంట్ చేశారు. కాగా, ఇటీవల చాలా మంది ప్రముఖులు..ఇతరులు ఎప్పుడో అప్‌లోడ్ చేసిన వీడియోలను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ Video :హెలికాఫ్టర్ నుంచి జారిపడి యువకుడు మృతి
మరోవైపు,సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో మరో రికార్డు బ్రేక్ చేశారు. ఉగాది పండుగ రోజున ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఓ ఫాలోవర్ ఆనంద్ మహీంద్రాకి గుర్తు చేయగా... నా ఫాలోవర్ల సంఖ్యకు గమనించిందుకు కృతజ్ఞతలు. పండగ రోజున ఈ ఘనత సాధించిందుకు ఆనందంగా ఉందంటూ ఆయన బదులిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, Viral Video