హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Anand Mahindra : పద్మభూషణ్ పొందే అర్హత నాకు లేదేమో -padma awards ceremony తర్వాత

Anand Mahindra : పద్మభూషణ్ పొందే అర్హత నాకు లేదేమో -padma awards ceremony తర్వాత

రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ స్వీకరిస్తోన్న ఆనంద్ మహీంద్రా

రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ స్వీకరిస్తోన్న ఆనంద్ మహీంద్రా

దేశంలో ఉన్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి భవన్ లో పద్మభూషణ్ పురస్కారాన్ని తీసుకున్న కాసేపటికే ఆయన.. ఈ అవార్డుకు తాను తగనివాడినంటూ పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది..

ఇంకా చదవండి ...

ఘనత తమది కాకున్నా సొంత డప్పు కొట్టుకోవడం.. అర్హత లేకున్నా అందలం ఎక్కాలనుకోవడం కూడా వ్యక్తిత్వ వికాసంగా ప్రచారమవుతోన్న ప్రస్తుత తరుణంలో.. వ్యక్తిగతంగా అన్ని అర్హతలు ఉండి కూడా.. చేతనైనంతలో దేశానికి, ప్రజలకు సేవలు చేస్తున్నా.. పురస్కారాలకు మాత్రం తాను తగని వాడిని అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా. బిజినెస్ లో బిజీ లైఫ్ లోనూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిరంతరం ఏదో ఒక కొత్త లేదా స్ఫూర్తిదాయ విషయాలు చెప్పే ఆయన.. దేశంలో ఉన్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. సదరు అవార్డుకు తాను తగనివాడినని చెప్పడం చర్చనీయాంశమైంది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు 2020 ఏడాదికిగానూ పద్మభూషణ్ పురస్కారం లభించడం తెలిసిందే. సోమవారం నాడు రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు ఆనంద్ మహీంద్రా. అయితే, పురస్కారాన్ని అందుకున్న కాసేపటికే ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో సంచలన పోస్టు పెట్టారు. అ అవార్డుకు తాను అర్హుడిని కాదేమోనని భావిస్తున్నట్లు చెప్పారాయన..

‘పద్మ పురాస్కారాలకు అర్హుల్ని ఎంపిక చేసే విషయంలో ఈ ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. అట్టడుగు స్థాయిలో సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతోన్న వ్యక్తులపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇలాంటి గొప్పవారి పక్కన ఈ పురస్కారాన్ని తీసుకోడానికి నిజంగా నేను అనర్హుడిగా భావిస్తున్నాను.’అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.

సంచలన పోస్టుకు తులసి గౌడ ఫొటోలను కూడా జతచేశారు ఆనంద్ మహీంద్రా. కర్ణాటకకు చెందిన తులసి గౌడ వేల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. కేంద్రం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించగా, ఆమె అవార్డు తీసుకుంటోన్న ఫొటోను మహీంద్రా షేర్ చేశారు. కాగా,

తాను పద్మభూషణ్ పురస్కారానికి అనర్హుడిలా ఫీలవుతున్నానంటూ ఆనద్ మహీంద్రా పెట్టిన పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆయన భావనను సమర్థించగా, ఇంకొందరు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా మహీంద్రా నిజాయితీని, సామాజిక సేవను పలువరు గుర్తుచేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Anand mahindra, Mahindra and mahindra, Padma Awards

ఉత్తమ కథలు