మేయర్‌గా ఎన్నికైన మేక.. కుక్క మీద ఘన విజయం

ఏడాదిపాటు ఆ మేక మేయర్‌గా చెలామణి అవుతుంది. దానికి మెమోరియల్ పరేడ్, ప్రతి శుక్రవారం ఆపిల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. అయితే, సమ్మర్‌లో మాత్రమే ఈ ఫెస్ట్ ఏర్పాటు చేస్తారు.

news18-telugu
Updated: March 9, 2019, 12:22 PM IST
మేయర్‌గా ఎన్నికైన మేక.. కుక్క మీద ఘన విజయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలోని ఓ చిన్న పట్టణంలో సరదా ఎన్నికలు జరిగాయి. ఫెయిర్ హెవెన్ అనే చిన్న టౌన్‌లో ప్లేగ్రౌండ్ నిర్మాణం కోసం నిధులు సమీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనుకున్నారు. ప్రజల నుంచి మామూలుగా అడిగితే డబ్బులు రావు కాబట్టి, ఓ ఎన్నిక నిర్వహించారు. అందులో కుక్కలు, పిల్లలు, మేకలు ఇలాంటివన్నీ పోటీ చేయవచ్చు. అయితే, అందులో పోటీ చేసే జంతువుల యజమానులు ఒక్కొక్కరు ఐదు డాలర్లు కట్టాలి. ఈ క్రమంలో స్థానిక స్కూల్ టీచర్‌కి చెందిన మేక కూడా బరిలో దిగింది. కొందరు తమ కుక్కలు, పిల్లులను కూడా పోటీలో నిలిపారు. చివరకు 13 ఓట్లతో మేక గెలిచింది. దీంతో మేక మేయర్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు.

ఫెయిర్ హెవెన్ టౌన్‌కి అధికారికంగా మేయర్ ఎవరూ లేరు. ఆ పట్టణానికి మేనేజర్ మాత్రం ఉంటాడు. జోసెఫ్ గంటర్ అనే మేనేజరే మేయర్ విధులు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఓ పిల్లి ఓ చిన్న పట్టణానికి మేయర్‌గా ఎన్నికైనట్టు పత్రికల్లో చదివాడు. అయితే, అలాంటి ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదని భావించాడు. ఈ క్రమంలోనే కొత్తగా మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఐడియా వచ్చింది. అనుకున్నదే తడవుగా అందరి ముందు ప్రతిపాదించాడు. అందులో పోటీ చేసిన వారు కట్టిన డబ్బులు అన్నీ కలిపితే మొత్తం 100 డాలర్లే వచ్చాయి. అదొక్కటే నిరాశ.

ఏడాదిపాటు ఆ మేక మేయర్‌గా చెలామణి అవుతుంది. దానికి మెమోరియల్ పరేడ్, ప్రతి శుక్రవారం ఆపిల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. అయితే, సమ్మర్‌లో మాత్రమే ఈ ఫెస్ట్ ఏర్పాటు చేస్తారు.
First published: March 9, 2019, 12:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading