Home /News /trending /

AN UPSIDE DOWN HOUSE IN COLOMBIA IS CAPTURING THE IMAGINATION OF VISITORS LOOKING FOR FUN PVN

Upside down house : ఆ ఇంట్లో కొద్దిసేపు గడిపేందుకు ఎగబడుతున్న జనం..అంత ప్రత్యేకత ఏంటంటే..

తలకిందులుగా కట్టిన ఇల్లు(ఫైల్ ఫొటో)

తలకిందులుగా కట్టిన ఇల్లు(ఫైల్ ఫొటో)

Varity house : ఆ ఇంట్లోకి వెళ్లి కొద్దిసేపు అక్కడే గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్థానికులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు కూడా ఆ ఇంటిని సందర్శించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ ఇల్లు కొత్త అనుభూతిని ఇస్తున్నట్టు సందర్శకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
Colombia house :  తలకిందులుగా కట్టిన ఓ ఇంటిని చూసేందుకు ఇప్పుడు జనం ఎగబడుతున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లి కొద్దిసేపు అక్కడే గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్థానికులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు కూడా ఆ ఇంటిని సందర్శించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ ఇల్లు కొత్త అనుభూతిని ఇస్తున్నట్టు సందర్శకులు చెబుతున్నారు. అయితే ఇంతలా అందిరినీ ఆకర్షిస్తున్న ఆ ఇల్లు ఎక్కడ ఉంది?అందులో ఉన్న ప్రత్యేకతలేంటో చూద్దాం.

కొలంబియా దేశంలోని గ్వాటావిటా ప్రాంతంలో నివసించే ఫ్రిట్జ్ షాల్ అనే ఆస్ట్రియన్ తలకిందులుగా ఓ ఇంటిని నిర్మించారు. 2015లో ఆస్ట్రియాలో తన మనవరాళ్లతో కలిసి ఫ్రిట్జ్ షాల్ తన స్వగ్రామానికి విహారయాత్రకు వెళ్లిన సమయంలో తలకిందులుగా ఓ ఇల్లును చూశారంట. ఆ ఇల్లు ఫ్రిట్జ్ షాల్ ని విపరీతంగా ఆకర్షించిందట. తాను కూడా ఇలాంటి ఇల్లు ఒకటి నిర్మించాలని అప్పుడే మనసులో అనుకున్నారంట. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. కొలంబియాలోని తాను నివసించే గ్వాటావిటా ప్రాంతంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంటి నిర్మాణం పూర్తి అయ్యింది. మూడు వారాల క్రితమే ఈ ఇంటిని ఓపెన్ చేశారు. ఇంటి నిర్మాణం పూర్తైన దగ్గర నుంచి దానిని చూడటానికి చాలామంది వెళ్తున్నారు. ఈ ఇల్లు కొత్త అనుభూతిని ఇస్తున్నట్టు సందర్శకులు చెబుతున్నారు.


ALSO READ Viral Video: కొండ అంచున కారు.. యూ-టర్న్‌ కు ప్రయత్నించిన డ్రైవర్.. తర్వాత ఏమవుతుందో ఊహించేలోపే ఇలా

ఈ సందర్భంగా ఆ ఇంటి యజమాని ఫ్రిట్జ్ షాల్ మాట్లాడుతూ..." తలకిందులుగా ఉన్న ఇంటిని నిర్మిస్తున్నానని చెబితే ఎవరూ నమ్మలేదు. పైగా నన్ను ఓ పిచ్చివాడిలా చూశారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఎవరెన్ని మాటలు అన్నా..ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంటి పనులు ఆపలేదు. కరోనా వైరస్,లాక్ డౌన్ కారణంగా ఇంటి నిర్మాణంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ ఏడాది ఇంటి నిర్మాణం పూర్తి చేయగలిగాను. . ఇప్పుడు ఆ ఇంటిని చూడ్డానికే జనం ఎగబడుతున్నా రని" షాల్ తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు