Home /News /trending /

AN ITALIAN TEENAGER 19 TROLLED BY NETIZENS FOR PROPOSING TO 76 YEAR OLD GIRL FRIEND SOULMATES GOES VIRAL PAH

OMG: లేటు వయసులో ఘాటు ప్రేమ.. 76 ఏళ్ల బామ్మతో ప్రేమ, పెళ్లి.. టీనేజర్ చేసిన పనికి నెటిజన్లు షాక్..

కాబోయే భార్యతో టీనేజర్

కాబోయే భార్యతో టీనేజర్

Love Affair: టీనేజర్ తన ఇంటికి దగ్గరలో ఉండే బామ్మతో లవ్ లో పడ్డాడు. ఆమెతోనే జీవితం పంచుకొవాలనుకున్నాడు. ఇద్దరు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.

కొంత మంది ప్రేమ (love) గుడ్డిదంటారు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరిమీద కలుగుతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది తొలి చూపులోనే లవ్ లో పడతారు. ఎదుటి వారు క్యాస్ట్, క్యాష్, కలర్ ల గురించి అసలు పట్టించుకోరు. వారిని చూడగానే ఒక తెలియని ఫీలింగ్ కల్గి వారితో ప్రేమలో పడుతుంటారు. మరికొందరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. క్యాష్, కలర్, ప్రాపర్టీ అన్ని ఉన్న వ్యక్తులను మాత్రమే లవ్ చేస్తారు. అయితే, కొంత మంది యువత.. కేవలం అవసరాల కోసమే లవ్ ని (love affair) ఒక పావుగా ఉపయోగించుకుంటారు. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరిగి చివరకు, అవసరాలు తీరాక ముఖాలు చాటేసుకుంటారు. కొంత మందైతే మరీ దారుణంగా.. ఒకరికి తెలియకుండా మరికొందరితో ప్రేమాయణాలు నడిపిస్తుంటారు. ఇలా మోసాలు చేయడంలో యువతి, యువకులు ఎవరు కూడా అతీతులు కాదు.

కొన్ని చోట్ల అబ్బాయిలు ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తుంటే.. మరికొన్ని చోట్ల యువతులు.. తమ వలుపు వలలో, మత్తెక్కించే మాటలతో అబ్బాయిలను తమ బుట్టలో వేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో టీనేజర్ లు పెళ్లైన తర్వాత కూడా లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. ఇంకొందరు దీనికి భిన్నంగా తమ కంటే ఏజ్ లో పెద్దవారితోను లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఇటాలియన్ (Italian) దేశానికి చెందిన గియుసెప్ అనే 19 ఏళ్ల టీనేజర్, 76 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఒకరితో మరోకరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలను కున్నారు. వీరి మధ్య ఏజ్ గ్యాప్.. 57 ఏళ్లు ఉన్న.. ఏమాత్రం లెక్కచేయలేదు. వీరిద్దరు ఈనెల 24 న వీరిద్దరు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా, బాలుడు.. మహిళకు డైమండ్ రింగ్ కూడా పెట్టాడు. ఆ తర్వాత.. ఆమెకు బెలూన్ ఇచ్చాడు. తనకు కాబోయే ఫియాన్సీకి కిస్ కూడా ఇచ్చాడు.

ప్రస్తుతం గియుసెస్ సోషల్ మీడియా (Social media) వేదికగా తమ ఎంగేజ్ మెంట్ ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై, నెటిజన్లు భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. నీకేవకు దొరకలేదా.. మరీ బామ్మతో ప్రేమ ఏంటని ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు ఎవరావిడా మీ బామ్మ నా.. అంటూ వ్యంగ్యంగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Love affair, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు