పరీక్షలు రాసేందుకు వెళ్లిన స్టూడెంట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన బీహార్(Bihar)లో చోటుచేసుకుంది. భాగల్‌పూర్(Bhagalpur)లోని ఇంటర్ పరీక్షలు(Intermediate exams) కొనసాగుతున్నాయి. రూపాకుమారి అనే స్టూడెంట్ ఎగ్జామ్స్ రాసేందుకు పరీక్ష కేంద్రానికి వచ్చింది. అయితే ఆమె నిండు గర్భిణి కావడంతో పరీక్ష రాసే సమయంలో పురిటి నొప్పులతో బాధపడింది. ఎగ్జామ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది ఆమెను వెంటనే భాగల్‌పూర్‌లోని సదర్ ఆసుపత్రి(Sadar Hospital)కి తరలించారు. అక్కడ రూపాకుమారి (Rupa Kumari)పండంటి ఆడ శిశువు(Baby girl)కు జన్మనిచ్చింది. సాధారణంగా ప్రసవం సమయంలో తల్లిదండ్రులు, డాక్టర్లు ఉంటారు. గర్భిణికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, లేక బిడ్డను కనే సమయంలో ఏదైనా జరిగినా ధైర్యం చెప్పడానికి తోడుగా ఉంటారు. కానీ డబ్బులు, కన్నవాళ్లు లేని అభాగ్యురాలు ప్రసవం కోసం ఎలాంటి ఇబ్బందులు పడతారో రూపాకుమారికి అర్దమైంది. ప్రసవం కారణంగా రూపాకుమారి పరీక్ష రాయలేకపోయాననే దిగులు పడుతోంది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఆమెకు మరో అకాశం కల్పిస్తామని చెప్పారు. జూన్‌లో జరిగే వార్షిక లేదా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో పరీక్షలకు హాజరు కావచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి (District Educational Officer)సంజయ్ కుమార్ (Sanjay Kumar)తెలిపారు.
ఎగ్జామ్ హాలులో పురిటి నొప్పులు..
సాధారణంగా పురిటి నొప్పులు వచ్చే విద్యార్దినులను పరీక్షలకు అనుమతించరు. అయితే రూపాకుమారి డెలవరీ సమయం డాక్టర్లు ఇచ్చిన గడువు కంటే ముందే నొప్పులు రావడంతో ఇలా ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్లిన సమయంలో బిడ్డను ప్రసవించాల్సి వచ్చిందని డాక్టర్లు, రూపాకుమారి బంధువులు తెలిపారు. ఇంటర్ చదువుతున్న రూపాకుమారి మేజర్ అని..ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్లు తెలిపారు.
పరీక్షలు రాయడానికి తల్లిగా పాసైంది..
చదువులు నేర్పే పరీక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు పుట్టింది కాబట్టి ఆ పసికందు చదువుల తల్లి అవుతుందని రూపాకుమారి తల్లిదండ్రులు ముచ్చటపడుతున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు రూపాకుమారి బంధువులు. ప్రసవం కారణంగా ఎగ్జామ్స్ రాయలేకపోయిన రూపాకుమారి ఈసారి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లేదా డిస్టెన్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసే సమయంలో పరీక్షలకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. ఆ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే పాస్ అయినట్లుగా పరిగణిస్తామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Intermediate exams, VIRAL NEWS