Home /News /trending /

Viral Video: ఇంత పెద్ద ఫ్యామిలీనా.. నెట్టింట ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఏనుగుల గుంపు వీడియో..!

Viral Video: ఇంత పెద్ద ఫ్యామిలీనా.. నెట్టింట ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఏనుగుల గుంపు వీడియో..!

ఏనుగుల గుంపు

ఏనుగుల గుంపు

నెట్టింట ఓ ఏనుగుల గుంపు వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో నెట్టింట సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. నెటిజన్ల ఫన్నీ కామెంట్లతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఓ అటవీశాఖాధికారి పెట్టిన ఆ వీడియోకు లైకుల ప్రవాహం కొనసాగుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఇంకా చదవండి ...
    అడవుల్లో ఏనుగులకు సంబంధించిన వీడియోలను మీరు గతంలోనే చూసి ఉంటారు. నెట్టింట వైరల్ అయిన ఏనుగుల వీడియోలకు లెక్కే లేదు. బావిలో పడిన పిల్ల ఏనుగును రక్షించుకోవడం కోసం నానా తంటాలు పడిన తల్లి ఏనుగు వీడియోను ఇప్పటికే ఓ లుక్కేసే ఉంటారు. రోడ్డుపై వెళ్తున్న కారును ఆపి, ఆ కారుపై కాలు పెట్టి నానా బీభత్సం సృష్టించిన ఏనుగుల వీడియోలను కూడా వైరల్ చేసి ఉంటారు. తాజాగా నెట్టింట మరో ఏనుగుల వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో నెట్టింట సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. నెటిజన్ల ఫన్నీ కామెంట్లతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఓ అటవీశాఖాధికారి పెట్టిన ఆ వీడియోకు లైకుల ప్రవాహం కొనసాగుతోంది.

    పర్వీన్ కస్వాన్ అనే అటవీ శాఖాధికారి జనవరి 28న తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ఏనుగుల గుంపు వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ’ఇదో హ్యాపీ ఫ్యామిలీ, లెక్కిస్తూనే ఉండండి‘ అంటూ కామెంట్ కూడా పెట్టారు. ఒక నిమిషం 19 సెకన్ల నిడివి ఉన్న ఆ చిన్న వీడియో, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద సెన్సేషనే క్రియేట్ చేస్తోంది. ఆ వీడియోను ఇప్పటికే 32500కు పైగా మంది నెటిజన్లు చూశారు. 210 మంది రీట్వీట్ చేశారు. 3వేల మందికి పైగా లైక్స్ చేశారు. ఇక ఈ వీడియో కింద కామెంట్స్ కు అయితే లెక్కేలేదు. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ తో ఆ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.



    ఆ వీడియోలో మొదటగా ఓ రెండు ఏనుగులు రోడ్డుకు అవతలి వైపు నుంచి ఇవతలి వైపునకు వెళ్లేందుకు వచ్చాయి. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొకటి ఏనుగులు వస్తూనే ఉన్నాయి. ఆ ఏనుగులు గుంపును చూసి అంతా అవాక్కవుతున్నారు. ’బహుషా కెమెరామెన్ భయపడిపోయి వీడియోను తీయడం ఆపేసి ఉంటాడనుకుంటా. లేకుంటే ఇంకా ఏనుగులు వస్తూనే ఉండేవి‘ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత పెద్ద ఫ్యామిలీనా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఆ ఏనుగుల గుంపు వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Elephant attacks, Social Media, Trending videos, VIRAL NEWS, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు