Home /News /trending /

AN ARTIST FROM CHENNAI HAS COME UP WITH AN INNOVATIVE VACCINE AUTO TO CREATE AWARENESS ON THE VACCINE VB

Awareness On Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ వినూత్న ప్రచారం.. వ్యాక్సిన్ ఆటోతో అవగాహన.. ఎక్కడంటే..

టీకాపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం

టీకాపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం

Awareness On Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి కొంతమంది ఇంకా భయపడుతున్నారు. తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో టీకాపై అపోహలు, భయాలు వెంటాడుతున్నాయి. అయితే ఇవన్నీ నిజం కాదని వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ గౌత‌మ్ వినూత్నంగా వ్యాక్సిన్ ఆటోను రూపొందించి వీధుల గుండా తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  కరోనాపై అవగాహన కల్పించడానికి పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వివిధ వేషధారణలో అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో కరోనా షేప్ లో ఉన్న బొమ్మలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. మొదటి వేవ్ కరోనా వ్యాప్తి కంటే సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. దేశంలో కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల సూచనలతో.. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా నిర్వహిస్తోంది. అయితే విస్తృతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్నా, సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో టీకాపై అపోహలు, భయాలున్నాయి. ఆ సందేహాలను.. అపోహల్ని నివృత్తి చేసేందుకు వైద్యులు, సెలబ్రిటీలు, సామాజికవేత్తలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడానికి చెన్నైకి చెందిన ఒక వ్యక్తి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.

  టీకాపై అవగాహన కల్పించేందుకు చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ గౌత‌మ్ వినూత్నంగా వ్యాక్సిన్ ఆటోను రూపొందించాడు. వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని తెలియజేయడానికి ఒక ఆటో రిక్షాకి వాక్సిన్ రూపాలను జతచేశాడు. అనంతరం చెన్నైలోని వీధులంతా తిరుగుతూ.. అవగాహన కల్పిస్తున్నాడు. చెన్నైలో ఆర్టిస్ట్ గౌతమ్‌కు చెందిన సంస్థ ‘ఆర్ట్ కింగ్‌డమ్’, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌తో కలిసి వ్యాక్సిన్ ఆటోను రూపొందించింది. టీకా గురించి ప్రజల్లో భయం పోగొట్టేందుకు రెండు నెలల క్రితం ఆటో డిజైన్‌కు సంబంధించి చెన్నై కార్పొరేషన్‌కు వివరించగా.. ఐడియా బాగుండటంతో కార్పొరేషన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో కేవలం పదిరోజుల్లోనే  ‘టీకా ఆటో’ రూపొందింది. ఆటోరిక్షా ముందు, వెనుక టీకాల‌ను పోలిన సిరంజీల‌తో డిజైన్ చేయగా, పైన వ్యాక్సిన్ సీసా న‌మూనాను ఉంచాడు. తెలుపు-నీలం రంగులోని ఈ త్రిచక్ర వాహనం చెన్నై వీధుల్లో ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది.  ఇరుకైన మార్గాల్లో ఆటోనే సరైన రవాణా మార్గంగా భావించి గౌతమ్ బృందం ఈ వాహనాన్ని రూపొందించింది.
  View this post on Instagram


  A post shared by art kingdom (@artkingdomorg)

  ఈ వ్యాక్సిన్ ఆటోకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ వ్యాక్సిన్ ఆటోను వ్యర్థ పదార్థాలైన వేస్ట్ పైప్, పాత ప్లాస్టిక్ బాటిల్ మరియు ప్లైవుడ్ వంటి వాటితో రూపొందించారు. ఇది చూడటానికి కొంత విచిత్రంగా కనిపిస్తూ.. ప్రజలను ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా హెల్మెట్ డిజైన్ చేసింది అతడే కావడం విశేషం. సామాజిక ప్రచారాలను కూడా నిర్వహించే గౌతమ్, శానిటరీ ప్యాడ్‌లపై జీఎస్టీని తొలగించాలని తెలుపుతూ.. ఓ ఆర్ట్ వేసి అందరిలోనూ అవేర్‌నెస్ తీసుకొచ్చాడు. జూన్ 25 నుంచి వ్యాక్సిన్ అవేర్‌నెస్ డ్రైవ్ మొదలుపెట్టగా కొవిడ్ నిబంధనలతో పాటు టీకా గురించిన ఆడియో‌ను ఇందులో నిరంతరాయం ప్లే చేస్తామని తెలిపారు. వలంటీర్లు ఎక్కడికి వెళ్లినా కరపత్రాలను పంపిణీ చేస్తారన్నారు. ఆటోలపై బ్యానర్లు కట్టి, మైకుల పెట్టి ప్రచారం నిర్వహించడం పాత పద్ధతే కానీ మా వ్యాక్సిన్ ఆటో ప్రజలను ఆకర్షిస్తుందని తెలియజేశాడు. వ్యాక్సిన్ ఆటోను పూర్తిగా రూపొందించడానికి దాదాపు పది రోజుల సమయం పట్టిందని అతడు తెలిపాడు. నెటిజన్లు ఈ ప్రయోగానికి ఫిదా అవుతున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Awarness to wear mask, Chennai, Corona Vaccine, Tamilanadu

  తదుపరి వార్తలు