Home /News /trending /

AN AFRICAN MAN BALANCED 735 EGGS ON HIS HEAD WITH HAT AND SETTING A GUINNESS WORLD RECORD PRV

Egg man: ఓరి దేవుడో.. తలపై ఏకంగా 735 గుడ్లను పెట్టి బ్యాలెన్స్​ చేశాడు.. గిన్నీస్​ రికార్డ్​ సృష్టించాడు.. ఎవరంటే

తలపై గుడ్లు నిలబెట్టిన వ్యక్తి (Photo: Guinnessworldrecord /Instagram)

తలపై గుడ్లు నిలబెట్టిన వ్యక్తి (Photo: Guinnessworldrecord /Instagram)

చైనాలో సీసీటీవీ ఛానెల్‌ నిర్వహించిన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు స్పెషల్‌ షోలో తలపై గుడ్లను పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్‌ చేస్తూ ప్రదర్శించాడు. అది చూసిన గిన్నీస్‌ రికార్డు ప్రతినిథులు కూడా ‘వావ్‌’ వెరీ గుడ్డు అని అనకుండా ఉండలేక పోయారట.

ఇంకా చదవండి ...
    ఓ ఐదు, ఆరు గుడ్లు (Eggs) చేతిలో పట్టుకోవాలంటేనే ఎక్కడ పగిలిపోతాయని భయపడిపోతాం. డజను గుడ్లు షాప్‌ నుంచి జాగ్రత్తగా పగలకుండా ఇంటికి తీసుకురావడానికి తంటాలు పడతాం. అటువంటిదో ఓ వ్యక్తి తన తలపై ఓ టోపీ పెట్టుకుని ఆ టోపీపై వందలాది ‘గుడ్లు’ నిలబెట్టి రికార్డు సృష్టించాడు. మరి ఎన్ని గుడ్లు అనుకుంటున్నారు? అబ్బా.. రెండు లేదా మూడు అనుకుంటున్నారా? కాదు.. పోనీ ఓ 20 గుడ్లు అనుకుంటున్నారా? ఏ మాత్రం కాదు.. ఓ 100 నిలబెట్టడమంటే అస్సలే కాదు. అనుకుంటారు. అయితే ఆ మనిషి ఏకంగా 735 గుడ్లు తల (head)పై ఉన్న టోపీపై ఉంచుకుని అందరిని షాక్ (shock) కి గురిచేశాడు. ఇంపాజిబుల్​ అంటారా?... అతను అలా గుడ్ల (eggs)తో టోపీని బ్యాలన్స్ చేస్తుంటే కళ్లార్పకుండా చూస్తాం. ఎక్కడ పడిపోతాయాని తెగ కంగారు పడిపోతాం. కానీ అతను మాత్రం చక్కగా టోపీ (hat)పై 735 గుడ్లు నిలబెట్టి (balance) వావ్  అనిపించాడు.

    అతని పేరే ఎగ్​ మ్యాన్​..

    ఆ పీట్​ చేసింది... సాధారణ మనిషే.. అతన్ని అందరూ ‘ఎగ్ మ్యాన్ (Egg man)’ అంటారు. ఎందుకంటే అతనికి గుడ్లతో ఫీట్లు చేయటం కొత్తకాదు. అందుకే అతనికి ఎగ్ మ్యాన్ అనే పేరు వచ్చింది. తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు  (world Record)కొట్టాడు కూడా. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్‌ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్‌ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు  (Guinness world record)అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇక అతని గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

    పశ్చిమ ఆఫ్రికా (West Africa)లోని కేప్‌ టౌన్‌ (cape town)కు చెందిన గ్రెగరీ (Gregory) దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్‌ మ్యాన్‌’గా పేరొందాడు. గ్రెగరీ (Gregary) అంటే పెద్దగా ఎవ్వరికి తెలీదు. ఎగ్ మ్యాన్ అంటే మాత్రం అందరూ గుర్తుపడుతారు.  ప్రపంచమంతా తిరిగి తన గుడ్ ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో ప్రదర్శించటం ఇతనికి అలవాటు. పలు టీవీ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. అలా అతను వరల్డ్‌ ఫేమస్‌ ఎగ్‌మ్యాన్‌ (world famous egg man)గా పేరొందాడు.



    కాగా, గ్రెగరీ ధరించిన టోపీ (hat)పై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజులు (three days) పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్‌ నిర్వహించిన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు స్పెషల్‌ షోలో తలపై గుడ్లను పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్‌ చేస్తూ ప్రదర్శించాడు. అది చూసిన గిన్నీస్‌ రికార్డు ప్రతినిథులు కూడా ‘వావ్‌’ వెరీ గుడ్డు అని అనకుండా ఉండలేక పోయారట. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్‌ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్‌ రికార్డు (gunnies record)లో స్థానం సంపాదించుకున్నాడు మన గ్రెగరీ.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: China, Guinness World Record, Trending videos, Viral vide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు