వయసు 8 ఏళ్లు... ఏడాది సంపాదన రూ.185 కోట్లు

గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇలాంటి ఎన్నో అద్భుతాల్ని నిజం చేస్తోంది. ఎంతో మంది యూట్యూబ్ ద్వారా సంచలనాలు సృష్టిస్తున్నారు.

news18-telugu
Updated: December 20, 2019, 5:57 AM IST
వయసు 8 ఏళ్లు... ఏడాది సంపాదన రూ.185 కోట్లు
ర్యాన్
  • Share this:
ఆ పిల్లాడి పేరు ర్యాన్ కాజీ. వయసు 8 ఏళ్లు. అమెరికా... టెక్సాస్‌లో పేరెంట్స్‌తో ఉంటాడు. ఈ ఏడాది ఫోర్బ్స్ మేగజైన్‌లో అత్యంత సంపాదనాపరుల్లో ఒకడిగా చోటు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఏడాదికి రూ.185 కోట్లు సంపాదిస్తున్నాడు. ఎలాగంటే... అతనికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు... ర్యాన్ ఫ్యామిలీ రివ్యూ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. క్రమంగా దానికి సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతున్న సమయంలో... మరో ఛానెల్ స్టార్ట్ చేశారు. అదే ర్యాన్ వరల్డ్. అది బుల్లెట్ రేంజ్‌లో దూసుకుపోయింది. ప్రస్తుతం ఆ ఛానెల్‌కి ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.3 కోట్ల మంది. ఇప్పుడా పిల్లాడు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా... ఒక్క రోజులోనే దాన్ని 10 లక్షల మందికి పైగా చూస్తున్నారు. ఇంతకీ ఛానెల్‌లో ఏం చేస్తాడంటే... మార్కెట్‌లో కొత్తగా వచ్చిన బొమ్మలు, ఆటవస్తువుల్ని రివ్యూ చేస్తాడు. వాడిని వాడి చూస్తాడు. ఆడతాడు, అవి ఎలా పనిచేస్తున్నాయో వివరిస్తూ వీడియో చేస్తాడు. అంతే అవి చూస్తూ పిల్లలు, పెద్దలు తెగ ఆనందపడుతున్నారు. అందువల్లే ర్యాన్ అప్ లోడ్ చేసిన ఓ వీడియోకి అత్యధికంగా 190 కోట్ల వ్యూస్ ఉంటే... మరో వీడియోకి 100 కోట్లు, మూడో వీడియోకి 35 కోట్ల వ్యూస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు... ఆ పిల్లాడి వీడియోలకు ఎంత క్రేజ్ ఉందో. ఈ ఏడాది రూ.185 కోట్లు సంపాదించిన ర్యాన్... లాస్ట్ ఇయర్ రూ.156 కోట్లు కొల్లగొట్టాడు. వచ్చే ఏడాది మరింత పెరగడం ఖాయమని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

ర్యాన్ వీడియోలు


First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు