AMRITSAR DEVOTEES OFFER LIQUOR AT BABA RODE SHAH SHRINE PAH
Liquor Prasadam: లిక్కరును దేవుడికి అర్పించి.. తిరిగి ప్రసాదంగా పొందుతారు.. ఎక్కడో తెలుసా..
లిక్కరు పంచుతున్న సిబ్బంది
Punjab: సాధారణంగా మనకు దేవాలయాల్లో కొబ్బరికాయలు, ఫలాలు ప్రసాదంగా పెడతారనే విషయం తెలిసిందే. కానీ అమృత్ సర్ లోని బాబారోడేషా ఆలయంలో భక్తులకు ప్రసాదంగా మద్యం బాటిల్స్ ను పంచుతారు.
Liquor Prasadam: పంజాబ్ లోని అమృత్ సర్ లో దాదాపు 90 ఏళ్లుగా ఒక వింత ఆచారంను పాటిస్తారు. అక్కడ బాబా రోడే షా దేవాలయం ఉంది. అక్కడ ప్రతి ఏడాది జాతర జరుగుతుంది. ఈ జాతర సమయంలో భక్తులకు మద్యాన్ని పంచుతారు. భక్తులు కూడా మద్యాన్ని స్వామి వారికి అర్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. మనం.. భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇతర మతాల నమ్మకాలను, పద్ధతులను గౌరవిస్తారు. అదే విధంగా కొన్ని చోట్ల వింత ఆచారాలు, పద్దతులు ఉంటాయి. అయితే, వాటి వెనుక ఏదో ఒకటి ఖచ్చితమైన కారణం ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఒక భిన్నమైన ఆచారం పంజాబ్ లోని అమ్రుత్ సర్ లోని ఒక ఆలయంలో ఉంది.
పూర్తి వివరాలు.. అమృత్ సర్ , ఫతేగఢ్ ప్రాంతంలోని చురియన్ రోడ్ మార్గం గుండా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. భోమా అనే గ్రామంలో బాబా రోడే షా మందిరం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జాతర సందర్భంగా మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. దీని వెనుక ఒక యదార్థగాథ ప్రాచుర్యంలో ఉందని స్థానిక సర్పంచ్ గుర్నేక్ సింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ధావన్ గ్రామిక గ్రామానికి చెందిన ఒక బాబా 1896 లో తన కుటుంబాన్నివిడిచి భోమాలో స్థిరపడ్డారు. అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆయనకు ఎవరు లేరు.
#WATCH | Devotees offered liquor at Baba Rode Shah shrine and distributed it among people as 'prasad' during a two-day annual fair that started in Bhoma village in Amritsar district of Punjab on Thursday pic.twitter.com/O7wOBTD2s8
ఒక రోజు సమీప గ్రామంలోని రైతు వచ్చి .. సంతానం తనకు లేదని ఆయన దగ్గర మొర పెట్టుకున్నారు. బాబాను దర్శించుకున్న కొన్నిరోజులకే రైతు కోరిక నెరవేరింది. దీంతో అతను ఆనందంతో బాబా దగ్గరకు వచ్చాడు. మీకు ఎదైన ఇవ్వాలను కుంటున్నట్లు చెప్పాడు. దానికి బాబా.. మద్యాన్ని ఇవ్వమని చెప్పారు. అదే విధంగా ఆ మద్యాన్ని అక్కడికి వచ్చే భక్తులకు తిరిగి ప్రసాదంగా పంచిపెట్టే వారు. ఆయన ఏనాడు మద్యం తాగలేదు. ఇలా ఆయన ప్రారంభించారు. క్రమేపీ ఇది ఆనవాయితీగా మారింది.
బాబా రోడేషా.. 1924 లో మరణించారు. అయినా భక్తులు అక్కడి దేవాలయాన్ని దర్శించుకుని మద్యాన్ని కానుకగా ఇస్తారు. అదే విధంగా దేవాలయ నిర్వాహకులు కూడా తిరిగి మద్యాన్ని ప్రసాదంగా తిరిగి ఇస్తారు. ప్రస్తుతం అక్కడ బాబా జాతర జరుగుతుంది. దీనిలో పాల్గొనడానికి భక్తులు పెద్ద ఎత్తున పొటేత్తారు. ఇప్పటికి అక్కడ మద్యాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు. అక్కడికి వెళ్లి ఏం కోరుకున్నా.. నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మొదట్లో ఆలయంలో పురుషులు,మహిళలకు దర్శనానికి వెర్వేరు రోజులు ఉండేవి. ప్రస్తుతం భక్తులు అందరు ఒకే సారి వచ్చి ఆలయంలో బాబాను దర్శించుకుంటున్నారు.
లిక్కరును బాబాకు అర్పించి, మద్యాన్ని తిరిగి ప్రసాదంగా పొందుతున్నారు. ఇది అక్కడి ఆలయ విశిష్టత. ఈ జాతర లో పాల్గొనడానికి యూపీ, హార్యానా, ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హిమచల్ ప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.