• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • AMOU HAJI IS AN 87 YEAR OLD MAN AND HE HAS NOT TAKEN A BATH IN 67 YEARS SSR

‘స్నానం చేసి ఎన్నాళ్లయింది బాబూ’ అని ఈ పెద్దాయనను అడక్కండి ప్లీజ్..!

‘స్నానం చేసి ఎన్నాళ్లయింది బాబూ’ అని ఈ పెద్దాయనను అడక్కండి ప్లీజ్..!

అమౌహాజి

స్నానం చేయడం మనిషి సాధారణ దినచర్యల్లో అతి ముఖ్యమైనది. ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే శరీరాన్ని తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేయకపోతే శరీరం దుర్వాసన రావడమే కాకుండా, లేనిపోని రోగాలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ఒక్కరోజు స్నానం చేయకుండా నలుగురిలోకి వెళ్లినా.. ఎదుటి వారికి చాలా ఇబ్బందికరంగా...

  • Share this:
    స్నానం చేయడం మనిషి సాధారణ దినచర్యల్లో అతి ముఖ్యమైనది. ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే శరీరాన్ని తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేయకపోతే శరీరం దుర్వాసన రావడమే కాకుండా, లేనిపోని రోగాలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ఒక్కరోజు స్నానం చేయకుండా నలుగురిలోకి వెళ్లినా.. ఎదుటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ‘స్నానం చేసి ఎన్నాళ్లయింది బాబూ’ లాంటి మాటలను పడాల్సి వస్తుంది. అలాంటిది.. ఒక మనిషి.. ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా 67 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడంటే నమ్మశక్యం కాదు. అతనెవరో ఆది మానవుడేమో అనుకునేరు. ఆ వ్యక్తి కూడా ఆధునిక మానవుడే. అలాంటి వింత మనిషి ఇరాన్‌లోని దెజ్గా అనే ప్రాంతంలో ఉన్నాడు. అతని పేరు అమౌహాజి. వయసు 87 సంవత్సరాలు. దాదాపు 67 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి స్నానం చేయడం మానేశాడు. అందరూ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. కానీ.. అమౌహాజి మాత్రం స్నానం చేస్తే అనారోగ్యానికి లోనవుతాడట. నీళ్లంటే అమౌహాజికి చాలా భయమట. స్నానం చేస్తే తాను అనారోగ్యానికి లోనవుతానని, ఆ భయంతోనే స్నానం చేయలేదని ఈ వింత మనిషి చెప్పాడు.

    అంతేకాదు, హాజికి ఇష్టమైన ఆహారమేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కుళ్లిపోయిన పంది మాంసం తనకు చాలా ఇష్టమైన ఆహారమని చెప్పాడు. హాజికి పొగతాగే అలవాటు కూడా ఉంది. కానీ.. అందరిలా చుట్ట, బీడీ, సిగరెట్ లాంటివి కాదు. జంతువుల మలాన్ని ఎండబెట్టుకుని హుక్కాలా పొగ తాగుతాడు. హాజికి పెళ్లి, పిల్లలు లాంటి బాధ్యతలేమీ లేవు. తనలాంటి వాడికి పెళ్లెలా అవుతుందని భావించి.. ‘సోలో బతుకే సో బెటర్’ అని జీవిస్తున్నాడు. అయితే.. హాజి కుర్రాడిగా ఉన్నప్పుడు కుటుంబపరంగా కొన్ని బాధలు ఎదుర్కొన్నాడని, అప్పటి నుంచి ఇలా మారిపోయాడని స్థానికులు చెప్పారు.

    అయితే.. ఇలా కొన్ని సంవత్సరాలుగా స్నానం చేయడం మానేసిన వ్యక్తి భారత్‌లో కూడా ఉన్నాడు. వారణాసికి చెందిన గురు కైలాష్ సింగ్ పెళ్లయిన కొన్నాళ్లకు స్నానం చేయడం మానేశాడు. కొందరు పూజారులెవరో స్నానం చేయడం మానేస్తే మగపిల్లాడు పుడతాడని గురు కైలాష్ సింగ్‌కు చెప్పారట. అప్పటి నుంచి స్నానం చేయడం మానేసిన గురు కైలాష్‌ లెక్క తప్పింది. ఒక్క మగ పిల్లాడు పుట్టకపోగా.. ఏడుగురు ఆడ పిల్లలకు తండ్రయ్యాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు