• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • AMITABH BACHCHAN REACTION ON STAR CRICKETERS DAUGHTERS BECOME CRICKET TEAM BECOMES VIRAL AK

Amitabh Bachchan: క్రికెటర్లుగా స్టార్ క్రికెటర్ల కూతుళ్లు.. అమితాబ్ రియాక్షన్‌.. సోషల్ మీడియాలో వైరల్

Amitabh Bachchan: క్రికెటర్లుగా స్టార్ క్రికెటర్ల కూతుళ్లు.. అమితాబ్ రియాక్షన్‌.. సోషల్ మీడియాలో వైరల్

team india (ఫైల్ ఫోటో)

Amitabh Bachchan: కుమార్తెలు ఉన్న క్రికెటర్ల జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ పేరు లేకపోవడాన్ని ప్రస్తావించిన అమితాబ్ బచ్చన్.. ధోనీకి కూడా కూతురు ఉందని.. ఆమె ఈ టీమ్‌కు కెప్టెన్ అవుతుందా ? అని సరదాగా ప్రశ్నించారు.

  • Share this:
    టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లికి కూతురు పుట్టడంతో ప్రముఖలంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొహ్లికి కూతురు పుట్టిన తరువాత చాలామందికి వింత వింత ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. కూతుళ్లు ఉన్న ఈ తరం క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తూ.. వీరి అమ్మాయిలు రాబోయే కాలానికి కాబోయే మహిళా క్రికెట్ టీమ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కూడా బాగా స్పందించారు. అయితే ఈ కామెంట్‌పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించిన తీరు.. ఇప్పుడు నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది.

    కుమార్తెలు ఉన్న క్రికెటర్ల జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ పేరు లేకపోవడాన్ని ప్రస్తావించిన అమితాబ్ బచ్చన్.. ధోనీకి కూడా కూతురు ఉందని.. ఆమె ఈ టీమ్‌కు కెప్టెన్ అవుతుందా ? అని సరదాగా ప్రశ్నించారు. అమితాబ్ ట్వీట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు వీరిలో కొందరైనా మహిళా క్రికెటర్లు అయ్యే అవకాశం ఉందని కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం అలా అయ్యే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.



    మీ కొడుకు అభిషేక్ మీ అంతటి స్టార్ కాలేకపోయారు కదా అని మరికొందరు సెటైర్ వేశారు. మొత్తానికి స్టార్ క్రికెటర్ల కూతుళ్లు రేపటి తరం మహిళా క్రికెటర్లు అవుతారేమో అనే సోషల్ మీడియా ప్రచారానికి.. అమితాబ్ ట్వీట్ మరింత బూస్టింగ్ ఇచ్చినట్టయ్యింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు