అమిత్ షాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ రోజు అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేరారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన.. ముక్కుకు చిన్నపాటి సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. సాయంత్రానికి అమిత్ షా డిశ్చార్జ్ కానున్నట్టు తెలుస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 4, 2019, 2:55 PM IST
అమిత్ షాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి..
అమిత్ షా (File)
  • Share this:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ రోజు అహ్మదాబాద్‌లోని కుసుమ్ ధీరజ్‌లాల్(కేడీ) ఆస్పత్రిలో చేరారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన.. మెడ వెనుక వైపు చిన్నపాటి సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన ఆయన సర్జరీ అయ్యాక డిశ్చార్జ్ అయ్యారు. ఓ కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంగళవారం సాయంత్రమే అహ్మదాబాద్ వచ్చిన అమిత్ షా.. అక్కడి నుంచి వైద్యం కోసం కేడీ ఆస్పత్రికి వెళ్లారు. ఆ సర్జరీ పూర్తై వెంటనే ఆయన డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, గత జనవరిలో అమిత్ షా స్వైన్ ఫ్లూకి గురై ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఛాతి పట్టేసినట్టుగా ఉండడం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడంతో ఎయిమ్స్ వెళ్లిన ఆయనకు స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు గుర్తించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 4, 2019, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading