Home /News /trending /

AMID OMICRON RISE CURBS ON NEW YEAR 2022 CELEBRATION IN SEVERAL CITIES IN INDIA OTHER SIDE FRANCE MALAYSIA ALSO BANNED MKS

New year 2022 : న్యూ ఇయర్ వేడుకలు రద్దు.. Omicron వ్యాప్తితో సర్కారు కఠిన ఆంక్షలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధాలు ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే చెన్నై, ముంబై, బెంగళూరు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల రద్దుకు ఆదేశాలు సిద్ధంకాగా, ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వాలు అతి త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.

ఇంకా చదవండి ...
    కరోనా మహమ్మారి దెబ్బకు మరో కొత్త సంవత్సరంలోకి భయంభయంగా అడుగుపెడుతోన్న పరిస్థితి. గడిచిన రెండేళ్లుగా న్యూ ఇయర్ వేడుకలకు దూరమైన ప్రజలు.. ఈసారైనా ఘనంగా జరుపుకొందామంటే.. ఈ ఏడాది చివర్లో పుట్టుకొచ్చిన కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ అన్నిటికీ అడ్డం పడుతోంది. ఇప్పటికే మన దేశంలోని 11 రాష్ట్రాల్లోకి ఓమిక్రాన్ వ్యాప్తి చెందిన దరిమిలా, అది మరింత విజృంభించకుండా ప్రజల కదలికలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధాలు ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే చెన్నై, ముంబై, బెంగళూరు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల రద్దుకు ఆదేశాలు సిద్ధంకాగా, ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వాలు అతి త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోనూ కొత్త ఏడాది వేడుకల రద్దయ్యాయి..

    కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దేశంలోని ప్రధాన నగరాలు, వాటి సబర్బన్‌ ప్రాంతాల్లో ఆంగ్ల సంవత్సరాది వేడుకలపై నిషేధం విధించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమిళనాడు రాజధాని చెన్నై, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాల్లోని బీచ్ లు, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో కఠిన ఆంక్షలు విధించారు. ముంబైలో డిసెంబర్ 31, జనవరి 1 వరకూ కర్ఫ్యూ(సెక్షన్ 144) అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేయగా, చెన్నైలోనూ ఆ రెండు తేదీల్లో వేడుకలు, జన సమూహాలకు అనుమతి లేదని ప్రభుత్వ యంత్రాంగం తేల్చి చెప్పింది.

    David Fuller : చనిపోయిన మహిళల్ని జుగుప్సాకరంగా రేప్ చేసి.. ఈ మానవ మృగం బారిన 102 మృతదేహాలు..


    ముంబై, చెన్నైతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో న్యూ ఇయర్ సందర్భంగా స్టార్‌హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని ఫామ్‌ హౌస్‌ల్లో మందు పార్టీలు, విందులు, వినోదాలు, నృత్యకార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఈ యేడాది ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి నిరోధించడానికి చర్యలు చేపట్టమంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘ఒమైక్రాన్‌’పై వచ్చే యేడాది జనవరి 15వరకు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ హెచ్చరించింది. ఈ పరి స్థితులలో రాష్ట్రాలు ఆంక్షల విధింపునకు సిద్ధమయ్యాయి.

    అతడి కోసం జైలుకు 12 మంది అందగత్తెలు.. పోలీసులకు నెలకు రూ.1కోటి లంచం.. ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు


    అన్ని నగరాల్లోని స్టార్‌ హోటళ్లు, వినోద క్లబ్బుల యజమానులు, ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులతో ఆయా స్థానిక పోలీసు ఉన్నతాధికారులు త్వరలో చర్చలు జరుపనున్నారు. ఈ విషయమైన చెన్నై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతాల్లో న్యూ ఇయర్‌ వేడుకలను, ప్రజ ల సందర్శనను నిషేధించిన నేపథ్యంలో ఫామ్‌హౌస్‌లు, స్టార్‌హోటళలో ఆ వేడుకలను జరుపుకునేందుకు అనుమతిస్తే వేల సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమికూడి వైరస్‌ వ్యాప్తికి కారకులవుతారన్నారు. అటు ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఇటు మలేషియాలోనూ న్యూ ఇయర్ వేడుకలు సమూలంగా రద్దయ్యాయి. బ్రిటన్ ప్రభుత్వం కూడా ఇదీ నిర్ణయం తీసుకోనుంది. ఒమిక్రాన్ బాధిత మిగతా దేశాలు కూడా న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండనున్నాయి.
    Published by:Madhu Kota
    First published:

    Tags: New Year 2022, Omicron, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు