AMID OMICRON COVID CASES SURGE DELHI GOVT ANNOUNCES NIGHT CURFEW FROM DEC 27 FULL DETAILS HERE MKS
omicron : నేటి నుంచి నైట్ కర్ఫ్యూ.. బయటికొస్తే బుక్ అయిపోతారు.. ఇవే రూల్స్..
నేటి నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
నేటి (డిసెంబర్ 27, సోమవారం) నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు ఇది అమలుకానుంది. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు అన్ని వ్యాపార కేంద్రాల వద్ద ఆంక్షలుంటాయి. వివరాలివే..
కరోనా సెకండ్ వేవ్ లో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. బ్రిటన్ తర్వాత ఫ్రాన్స్ లో ఒకే రోజు లక్షల పైచిలుకు కేసులు వచ్చాయి. యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ మరణాలు పెరుగుతున్నాయి. అమెరికా సహా 100 దేశాల్లో ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి ఉంది. భారత్ లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా కాంటాక్టులకూ సోకుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో పలు రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ విధించాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ నైట్ కర్ఫ్యూ ప్రకటించారు. ఇవాళ(డిసెంబర్ 27, సోమవారం) నుంచే అది అమల్లోకి రానుంది. వివరాలివి..
దేశంలో ఒమిక్రాన్ కేసులు పైపైకి పెరుగుతూ ఐదు వందల మార్కు దిశగా వెళుతున్నాయి. ఆదివారం రాత్రి వరకు కొత్తగా మరో రెండు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లోనూ) ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 కేసులుండగా, 44 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కాగా, ఢిల్లీలో ఇతర వేరియంట్ల కొవిడ్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 290 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో 16 శాతం ఎక్కువ కేసులు నమోదుకావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఢిల్లీలో నేటి (డిసెంబర్ 27, సోమవారం) నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు ఇది అమలుకానుంది. తాజాగా ఒమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులూ పెరగడంతో కేజ్రీవాల్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
నైట్ కర్ఫ్యూతోపాటు ఢిల్లీలో ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు అన్ని వ్యాపార కేంద్రాల వద్ద ఆంక్షలుంటాయి. ఢిల్లీలోని బార్లు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు అది కూడా 50 శాతం కెపాసిటీతోనే నడిపించాలి. రెస్టారెంట్లు కూడా 50 శాతం కెపాసిటీతోనే నడవాలి. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్, ఆడిటోయిరం, జిమ్, స్పా సెంటర్లు, పబ్లిక్ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియాలు పూర్తిగా మూతపడనున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.