AMID HEAVY SNOWFALL INDIAN ARMY MEDICAL TEAM TAKES A PREGNANT WOMAN BY 6KM ON FOOT IN JAND K NEAR LOC VIRAL VIDEO MKS
సాహో Indian Army : మోకాలిలోతు మంచులో గర్భిణిని మోస్తూ 6కి.మీ నడక.. viral video
గర్భిణిని మోసుకొస్తున్న ఆర్మీ మెడికల్ టీమ్
ప్రమాదకరమైన వాతావరణంలోనూ దేశ రక్షణ విషయంలో ఇంచు కూడా కాంప్రమైజ్ కాని భారత సైన్యం.. సామాన్యుల ప్రాణాలకు సైతం అదే స్థాయిలో ప్రాధాన్యమిస్తూ ఎలాంటి సహాయానికైనా వెనుకడుగు వేయలేదు. శనివారం నాడు చోటుచేసుకున్న ఓ ఘటన ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురిపిస్తోంది.
ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో గడిచిన వారం రోజులుగా అక్కడ మంచు వర్షం కురుస్తోంది.. హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది.. జమ్మూకాశ్మీర్ లో ఎమర్జెన్సీ సేవలు సైతం అతి కష్టం మీద నడుస్తున్నాయి.. ఇలాంటి క్లిష్ట సమయంలో సాయం కోసం ఓ మారుమూల గ్రామం నుంచి పిలుపందింది.. అంతే, మన ఆర్మీ జవాన్ల మెడికల్ బృందం పరుగులు తీసింది.. ఊళ్లకు ఊళ్లే మంచులో కప్పుపుకొనిపోగా అతి కష్టం మీద.. పాకిస్తాన్ నియంత్రణ రేఖకు సమీపంగా వెళ్లాల్సిన చోటును గుర్తించారు.. ఆర్మీ మెడికల్ టీమ్ అక్కడికి చేరేలోపే సాయం కోసం ఎదురుచూస్తోన్న గర్భిణి పరిస్థితి కొంత జఠిలంగా మారింది.. అంబులెన్స్ కాదుకదా, నడవడానికి కూడా కష్టమైన ఆ దారిలో మన జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టి ఆ మహిళను కాపాడగలిగారు.. వివరాలివి..
ప్రమాదకరమైన వాతావరణంలోనూ దేశ రక్షణ విషయంలో ఇంచు కూడా కాంప్రమైజ్ కాని భారత సైన్యం.. సామాన్యుల ప్రాణాలకు సైతం అదే స్థాయిలో ప్రాధాన్యమిస్తూ ఎలాంటి సహాయానికైనా వెనుకడుగు వేయలేదు. శనివారం నాడు చోటుచేసుకున్న ఓ ఘటన ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురిపిస్తోంది. యావత్ నెటిజన్లు సాహో ఇండియన్ ఆర్మీ అంటూ సెల్యూట్ చేస్తున్నాయి. మోకాలిలోతు మంచులో గర్భిణిని మోస్తూ జవాన్లు చేపట్టిన ఎమర్జెన్సీ తరలింపునకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి..
పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)కి సమీపంలో ఘజ్జర్ హిల్స్ అనే ప్రాంతం ఉంది. బారాముల్లా జిల్లా పరిధిలోకి వచ్చే ఆ చోట ఓ కుగ్రామంలో గర్భిణి మహిళకు పెద్ద కష్టం వచ్చిపడింది. నెలలు నిండిన ఆమెకు సమస్యలు తలెత్తడంతో కుటుంబీకులు సాయం కోసం అభ్యర్థించారు. మంచులో బయలుదేరిన ఆర్మీ మెడికల్ బృందం.. ఆ మహిళ జాడను కనిపెట్టి వైద్యం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను సాధ్యమైనంత తొందరగా ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన మెడికల్ టీమ్ స్వయంగా గర్భిణిని భుజాలపై మోస్తూ అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చింది.
ఘజ్జర్ హిల్స్ నుంచి సలాసన్ వరకు మొత్తం 6 కిలోమీటర్లపాటు గర్భిణిని నలుగువైపులా మోస్తూ, ఆర్మీ జవాన్ల మెడికల్ టీమ్ ఆమెను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చగలిగింది. విపరీతమైన హిమపాతం, ప్రతికూల వాతావరణంలో ఏమాత్రం చలించకుడా భారత జవాన్లు చూపిన చొరవకు స్థానికులు, బాధితురాలి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా సురక్షితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది.
#WATCH | Amid heavy snowfall, Indian Army medical team conducted an emergency evacuation of a pregnant woman from Ghaggar Hill village near LOC and brought her to an ambulance at Salasan in Baramulla, Jammu & Kashmir. pic.twitter.com/jAUsnnawDd
జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ సహా కాశ్మీర్ లోయ అంతటా భారీగా మంచు కురుస్తోంది. శుక్ర, శనివారాల్లో మంచు తీవ్రత, హిమపాతం పెరిగాయి. గుల్మార్గ్, పహల్గామ్లో తీవ్రస్థాయిలో మంచు కురుస్తోంది. రాబోయే మూడు రోజులపాటూ అక్కడ హిమపాతం పెరగొచ్చని భారత వాతావరణ విభాగం (IMD) ఈరోజు తెలిపింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.